నిఫ్కో ఆర్థిక సంస్థ ఏలియెన్స్ డెవలపర్స్‌లో సుమారు రూ.145 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టింది. అదేవిధంగా, స్వామి-1 ఫండ్ ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టులో రూ.320 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని సమాచారం. ఏలియెన్స్ సంస్థకు ప్రస్తుతమున్న అప్పుల్ని తీర్చివేయడమే కాకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమయ్యేందుకు రూ.145 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. ఏలియెన్స్‌కు తెల్లాపూర్‌లో ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ అనే మెగా మిడ్ ఇన్‌కమ్ హౌసింగ్ ప్రాజెక్టు ఉంది.
2011లో కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేయాల్సిన ఈ ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదు. హైదరాబాద్‌లోని చెన్నారంలో ఏలియెన్స్ హబ్ ప్రీమియం ప్లాటెడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును 272 ఎకరాల్లో సొంతంగా డెవలప్ చేస్తోంది. ఒక్కో ప్లాటు 300 గజాల్లో డెవలప్ చేయగా.. సుమారు 2400 ప్లాట్లు ఉండటం గమనార్హం