poulomi avante poulomi avante

మూసీలోకి గోదావరి నదీ జలాలు

మూసీ పరివాహక ప్రాంతంలో ఈస్ట్-వెస్ట్ కారిడార్లు

మూసీ చుట్టూ హాకర్స్-గేమింగ్-ఎంటర్టైన్మెంట్ జోన్స్

హైదరాబాద్ పేరు వినగానే అందరికి గుర్తుకువచ్చేది ఛార్మినార్. ఐతే ఇప్పుడు భాగ్యనగరానికి ఛార్మినార్ తో పాటు మరో ఐకాన్ వచ్చి చేరబోతోంది. అదే మూసీ నది. అవును మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేసి లండన్ థేమ్స్ నదిలా సుందరీకరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ నదిలో గోధావరి జలాలాను పారించి స్వఛ్చంగా మార్చడంతో పాటు మూసీ చుట్టూ ప్రత్యేక కారిడార్ల నిర్మాణం, హాకర్స్ జోన్స్ వంటి ఎన్నో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్. అంతా అనుకున్నట్లు వచ్చే రెండేళ్లలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పూర్తైతే హైదరాబాద్ రూపురేఖలు ఎవ్వరూ ఊహించలేనంతగా మారిపోనున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మూసీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది అభివృద్ది పనులు ఊపందుకోనున్నాయి. ఇందుకోసం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సన్నాహాలు చేస్తోంది. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభమవ్వాలంటే ముందుగా నదీ పరివాహక ప్రాంతంలోని అక్రమణలన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోని షెడ్లు, గోదాంల కూల్చివేతనూ చేపట్టనున్నారు. మూడు నెలలుగా హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, ఎంఆర్‌డీసీఎల్‌ తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి తూర్పున కొర్రేముల వద్ద ఉన్న ఔటర్‌ వరకు సర్వేను పూర్తి చేశారు. నార్సింగ్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో 12 వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు.

వీటిలో హైదరాబాద్‌ జిల్లాలోని ఆసిఫ్నగర్‌, అంబర్‌పేట, బహదూర్‌పురా, చార్మినార్‌, గోల్కొండ, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, సైదాబాద్‌ల పరిధిలో పెద్దఎత్తున ఆక్రమణలు జరిగినట్టు తేల్చారు. బహదూర్‌పురా, సైదాబాద్‌, అంబర్‌పేట మండలాల పరిధిలో అధికంగా నిర్మాణాలు ఉన్నాయి. చాలావరకు మూసీ నదిలోనే కాలనీలు సైతం ఏర్పడ్డాయి. చచాలా వరకు మూసి పరివాహక ప్రాంతంలో 30, 40, 60 గజాల్లోనే ఇండ్లు కట్టుకున్నారు.

మధ్యలో 10 అడుగుల దారి కూడా లేకుండా నిర్మించుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ మండల పరిధి రామంతాపూర్‌, భగాయత్‌ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే ఉన్నాయి. కొందరు గోదాములు, షెడ్‌లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటిని తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు.

మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆక్రమణలను తొలగించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ హైడ్రా సహకారం తీసుకోనుందని తెలుస్తోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లండన్‌ లోని ప్రఖ్యాత థేమ్స్ నది తరహాలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తోంది.

సుమారు 200 ఏళ్ల కిందట పారిశ్రామిక విప్లవం సమయంలో థేమ్స్ నదిలోకి పరిశ్రమల వ్యర్థాలు, మానవ వ్యర్థాలు నేరుగా వెళ్లడం మొదలవ్వగా.. రానురాను 1957 సమయంలో థేమ్స్ నదిని బయోలాజికల్లీ డెడ్ గా లండన్ నాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది. ఆ తర్వాత అక్కడి అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుని థేమ్స్ నదిని ప్రక్షాళన చేస్తూ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జనవరిలో లండన్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థేమ్స్ నదిని పరిశీలించడంతో పాటు..థేమ్స్ నది పాలకమండలితో సమావేశమై చర్చించారు. మన హైదరాబాద్ లో ని మూసీ నదిని సైతం ధేమ్స్ నదిలా అభివృద్ది చేయాలని నిర్ణయించారు.

2026 జూన్ కల్లా మూసీ నదిలో మంచినీరు ప్రహించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఆమేరకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు అధికారులు. ఈ మేరకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసీ ప్రక్షాళనకు సంబందించిన పనుల టెండర్లు పిలిచేందుకు సమాయుత్తం అవుతోంది. మొదటి విడతగా రూ.10వేల కోట్లతో పనులు మొదలు కాబోతున్నాయి. గోదావరి నుంచి నీటిని తీసుకువచ్చి గండిపేట, హిమాయత్ సాగర్‌లో ఐదు టీఎంసీలు నింపనుండగా.. అక్కడి నుంచి మూసీలోకి స్వఛ్చమైన గోదావరి నీరు పారించేలా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

ఆ నీరు సూర్యాపేట వరకు పారేలా చర్యలు తీసుకోవడంతో పాటు.. అక్కడక్కడ చెక్ డ్యామ్‌లు కట్టి నీటిని నిల్వ చేయనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్, వెస్ట్ కారిడార్ కట్టడంతో పాటు. ప్రత్యేకంగా. హాకర్స్ జోన్స్ ను ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే యేడాది జనవరిలో మూసీ నది ప్రక్షాళనకు సంబందించిన టెండర్ల ప్రక్రియ ముగియడంతో పాటు అందుకు సంబంధించిన‌ పనులు ప్రారంభం కానున్నాయి.

మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి. మంచి రేవుల నుంచి మొదలు నాగోల్ వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణతో ఈ ప్రాంతానికి మహర్ధశ పట్టబోతోంది. మరీ ముఖ్యంగా మూసీ సుందరీకరణలో భాగంగా ఈస్ట్-వెస్ట్ కారిడార్ల నిర్మాణం, హాకర్స్ జోన్స్ ఏర్పాటు, రీక్రియేషన్ జోన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, పార్కులు, బోటింగ్ సౌకర్యం, వాకింగ్ ట్రాక్స్ వంటి ఎన్నో ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే రెండు మూడేళ్లలో మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా ఇవన్నీ ఏర్పాటైతే హైదరాబాద్ మరింతగా మారిపోనుంది.

హైదరాబాద్ అనగానే ప్రస్తుతం గుర్తుకు వచ్చే ఛార్మినార్, హైటెక్ సిటీ, గోల్కొండ తో పాటు మూసీ నది సైతం మరో ఐకానిక్ గా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే మూసీ ప్రక్షాళనకోసం గతంలో చాలా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా అవేవి ఫలించలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏ మేరకు మూసీ ప్రక్షాళనపై ముందుకు వెళ్తుందనేది ముందు ముందు తేలాల్సి ఉంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles