poulomi avante poulomi avante

భారత్ లో డేటా సెంటర్ల వృద్ధి భేష్

  • గత ఐదేళ్లలో భారీగా పెట్టుబడులు
  • నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి

భారతదేశంలో డేటా సెంటర్ల వృద్ధి చాలా బాగుందని, ముఖ్యంగా గత నాలుగైదు ఏళ్లలో ఇది గణనీయంగా ఉందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. రియల్ ఎస్టేట్ ప్లేయర్ల నుంచి పెట్టుబడులతోపాటు ప్రైవేట్ ఈక్విటీ నిధుల నుంచి భారీగా వెచ్చించడంతో వీటి పురోగతి గతంలో ఎన్నడూ లేనంత‌గా ఉందని వివరించింది. 2016 నుంచి 2021 మధ్యకాలంలో డేటా సెంటర్లలో ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు ఏకంగా 259 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. 2016లో ఇవి 616 మిలియన్ డాలర్లు ఉండగా.. 2021 నాటికి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని.. వీటిలో అధిక మొత్తం విదేశీ పెట్టుబడిదారుల నుంచే వచ్చాయని వెల్లడించింది.

ఇందులో 96 శాతం విదేశీ పెట్టుబడులు కాగా, కేవలం నాలుగు శాతమే స్వదేశీ పెట్టుబడులని నివేదికలో పొందుపరిచింది. 2021లో వచ్చిన మొత్తం పెట్టుబడులను వాటాలవారీగా పరిశీలించగా.. డేటా సెంటర్లు రెండో స్థానంలో నిలిచాయి. గతంలో రెండో స్థానంలో ఉన్న వేర్ హౌసింగ్, రెసిడెన్షియల్ విభాగాల్ని డేటా సెంటర్లు వెనక్కి నెట్టాయి. పెట్టుబడిదారులు ప్రధానంగా ముంబై వంటి మెట్రో, టైర్-1 నగరాలపైనే ఎక్కువగా దృష్టి సారించారని పేర్కొంది. ఇందులో హైదరాబాద్ తోపాటు చెన్నై, బెంగళూరు, పుణె, ఇండోర్ వంటి నగరాలు కూడా ఉన్నాయని తెలిపింది.

డేటాయే సరికొత్త ఇంధనం

ప్రస్తుత ప్రపంచంలో డేటా అనేది సరికొత్త ఇంధనంగా మరిపోయిందని నైట్ ఫ్రాంక్ వ్యాఖ్యానించింది. నిరంతరం మారుతున్న వినియోగదారుల అవసరాలకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి కంపెనీలు వారి డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా డేటా అనేది విపరీతమైన వృద్ధి సారించింది. అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాల ప్రకారం.. 2018లో గ్లోబల్ డేటా స్పియర్ 33 జెటాబైట్ లు ఉండగా.. 2025 నాటికి అది 175 జెటాబైట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. మనదేశంలో కూడా ఇంటర్నెట్ వినియోగం, ఓటీటీల వాడకం వంటివి పెరిగిన నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగిందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. చైనా తర్వాత అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.

2015లో నెలకు ఒక వినియోగదారుడు సగటున 0.8 జీబీ డేటాను వినియోగించగా.. 2021 నాటికి 14.1 జీబీకి పెరిగిందని.. 2025 నాటికి 25 జీబీ అవుతుందని అంచనా. ఇలా డేటా వినియోగం పెరుగుతున్నందున దేశంలో డేటా సెంటర్లకు డిమాండ్ ఎక్కువైందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇక 110 దేశాల్లో 8,347 డేటా సెంటర్లు ఉండగా.. అమెరికా (33.1 శాతం), యూకే (5.8 శాతం), జర్మనీ (5.5 శాతం), చైనా (5.4 శాతం), కెనడా (3.9 శాతం) కలిసి సగానికి పైగా డేటా సెంటర్లను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో భారత్ 1.5 శాతంలో ఉండటం గమనార్హం. భారత రియల్ ఎస్టేట్ లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు కూడా భారీగా పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 2021లో ఏకంగా 6.2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles