టీమ్ 4 ఆర్కా ప్రాజెక్టు అణువణవూ ఎన్నో ప్రత్యేకతలు నిండి ఉన్నాయి. ప్రతి ఒక్క అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ దీనిని రూపొందించారు. మునుపెన్నడూ లేని అత్యున్నతమైన ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, అదిరిపోయే డిజైన్ తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6 టవర్లను 43 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు నాలుగైదు యూనిట్లు ఉంటాయి. ప్రతి అంతస్తుకూ ఐదు ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపు అడుగుల నుంచి 4410 చదరపు అడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు.
ప్రాజెక్టు మొత్తం ఒక ఎత్తైతే.. క్లబ్ హౌస్ మరో ఎత్తు. అంత అబ్బురపరిచేలా దీని డిజైన్ ఉంది. ఏకంగా ఆరు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఫిట్ నెస్ ఔత్సాహికులు, స్నూకర్ ప్రేమికులు, యోగా ప్రియులు, కాఫీ ప్రియులు.. ఇలా ప్రతి ఒక్కరికీ అవసరమైన సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. టెర్రస్ పై టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమింగ్ పూల్, ఆరో అంతస్తులో సూట్ రూమ్స్, వెయిటింగ్ లాంజ్, ఐదో ఫ్లోర్ లో సూట్ రూమ్స్, గెస్ట్ రూమ్స్, నాలుగో అంతస్తులో బిలియర్డ్స్ లాంజ్, బ్యాడ్మింటన్ కోర్టులు, మూడో ఫ్లోర్ లో సిమ్యులేషన్ గేమింగ్ స్పోర్ట్స్ లాంజ్, ప్రివ్యూ థియేటర్, స్నాక్ బార్ లాంజ్, ఇండోర్ గేమ్స్, స్క్వాష్ కోర్టు, టేబుల్ టెన్నిస్, డబుల్ హైట్ కోర్టు యార్డ్, రెండో అంతస్తులో ల్యాండ్ స్కేప్ డెక్, జిమ్, ఏరోబిక్స్, యోగా, మెడిటేషన్, వెయింగ్ లాంజ్, క్రాస్ ఫిట్, మొదటి ఫ్లోర్ లో ఎంట్రన్స్ లాబీ, ప్రి ఫంక్షన్ హాల్, రెండు బ్యాంకెట్ హాల్స్, ఫిజియో, క్లినిక్, బ్యాంక్, లాకర్ స్పేస్, గ్రౌండ్ ఫ్లోర్ లో మల్టీ పర్పస్ హాల్, కిడ్స్ ప్లే ఏరియా, క్రెష్, ప్రి ఫంక్షన్ హాల్, ఎంట్రన్స్ ల్యాబీ, రిసెప్షన్ లాంజ్, కేఫ్ లాంజ్, ఫార్మసీ, గ్రాసరీ, ఎఫ్సీసీ రూమ్, గ్రీన్ రూమ్ ఉన్నాయి. ఇందులో ఆరు బ్యాడ్మింటన్ కోర్టులు ఉండటం మరో విశేషం.
This website uses cookies.