Categories: TOP STORIES

హన్మకొండ ఫ్లాట్ల ధరలు

హైదరాబాద్ తర్వాత హన్మకొండలో అపార్టుమెంట్ల నిర్మాణం అధికంగా జరుగుతోంది. ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలూ భాగ్యనగరంతో సమానంగానే ఉన్నాయి. అడ్వొకేట్స్ కాలనీలో ఓ 1200 చదరపు అడుగుల్లో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.70 లక్షలు చేతిలో ఉండాల్సిందే. ఫాతిమానగర్లో కొనాలంటే రూ. 60 లక్షలు పట్టుకోవాల్సిందే. పుప్పాల్ గుట్ట, బ్యాంక్ కాలనీ, బీమారం వైపు రేట్లు కాస్త అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. మరి, పలు ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలెలా ఉన్నాయంటే..

అడ్వొకేట్స్ కాలనీ 4500-5000
ఫాతిమానగర్ 4000- 4600
ప్రశాంత్ నగర్ 3800- 4500
వడ్డేపల్లి 3800- 4500
హంటర్ రోడ్డు 4200- 4500
బీమారం 3600- 4200
సుబేదారి 4000- 4600
డాక్టర్స్ కాలనీ 3800- 4500
దేశాయిపేట్ రోడ్డు 3500- 3900
గోపాల్ పూర్ రోడ్డు 3500- 4400
బ్యాంక్ కాలనీ 3600- 4000
పుప్పాల్ గుట్ట 3200- 3600
కాజీపేట్ 3800- 4400
కిషన్ పురా 4000- 4600

(చదరపు అడుక్కీ)

ప్లాట్ల ధరలిలా ఉన్నాయ్..

బాలసముద్రం,అడ్వకేట్స్ కాలనీ, వడ్డేపల్లి టీచర్స్ కాలనీ, కూడా కాలనీ ప్రాంతాల్లో వంద అడుగుల రోడ్డులో ప్లాట్లు ఉన్నాయి. అందుకే, ఇక్కడ రేటు హైదరాబాదు తర్వాతి స్థాయిలో ఉంటాయి. హన్మకొండ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఒక ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఆయా ప్రాంతం నగరానికి ఎంత చేరువగా ఉంది? అక్కడ అందుబాటులో ఉన్న ఖాళీ ప్లాట్లు వంటి అంశాల ఆధారంగా ప్లాట్ల తుది ధర ఆధారపడుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమేనని గుర్తుంచుకోండి. అంతేతప్ప, ఇవే తుది రేట్లు కావు.

బాల సముద్రం 48000- 50000
అడ్వొకేట్స్ కాలనీ 50000- 54000
కుడా కాలనీ 40000- 45000
వడ్డేపల్లి 35000- 40000
కాజీపేట్ 20000- 25000
గోపాల్ పురం 35000-40000
బీమారం 30000- 35000
హంటర్ రోడ్డు 30000- 36000
నర్సంపేట్ రోడ్డు 25000- 30000
హసన్ పర్తి 15000-20000
మడికొండ 20000- 25000

(చదరపు గజానికి)
– VORAM NATRAJ SUNDER, 76740 08199 (regnews21@gmail.com)

This website uses cookies.