Categories: LATEST UPDATES

అక్రమ నిర్మాణాల కూల్చివేత

ప్లాటు కొంటే చాలు.. ఐదేళ్లలో 200 శాతం అప్రిసీయేషన్.. చేరువలో పారిశ్రామిక కారిడార్.. మెట్రో కనెక్టివిటీ.. అంటూ కొందరు డెవలపర్లు అరవై గజాలు, 75, 100 నుంచి 200 గజాల్లో ప్లాట్లను విక్రయించారు. కొందరైతే అందులో ఇళ్లనూ కట్టుకోవడం ఆరంభించారు. ఆ ఇళ్ల గురించి సోషల్ మీడియాలో హల్ చల్ మొదలైంది. కొందరు తాత్కాలికంగా దుకాణాల్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల్ని కట్టేశారు. దీంతో ఆలస్యంగా తేరుకున్న డీటీసీపీ అధికారులు ముందస్తుగా హెచ్చరించారు. అయినా, ఆ డెవలపర్లు వెనక్కి తగ్గలేదు. దీంతో జిల్లా ప్రణాళికా అధికారి స్థానికంగా సుమారు యాభై మంది పోలీసు సాయంతో రంగంలోకి దిగి.. జేసీబీలను తీసుకొచ్చి ఆ అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేశారు. ఈ సంఘటన తెలంగాణలో కాదు.. గుర్గావ్ లో జరిగింది.

This website uses cookies.