Ranbir, Alia's new home is ready
బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కొత్త భవనం విలువ ఎంతో తెలుసా? దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని టాక్. ముంబై బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఈ భవనం ఉంది. ఆరు అంతస్తుల ఈ బంగ్లాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కలల ఇంట్లో కొత్త ప్రారంభం.. ఆలియా, రణ్ బీర్ ల లవ్లీ హోమ్ సిద్ధంగా ఉంది అనే శీర్షికతో దీనిని షేర్ చేశారు. బంగ్లా నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లోపు ఈ జంట కొత్త ఇంటికి మారే అవకాశం ఉందని సమాచారం. ప్రతి అంతస్తుకు ఫెన్సింగ్, పచ్చదనం జోడించారు. అయితే, ఇంటికి ఇంకా గేటు పెట్టలేదు. దీనిపై నెటిజన్లు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. గేటు పెట్టడానికి కూడా డబ్బులు మిగుల్చుకోకుండా మొత్తం ఖర్చు చేశారంటూ చమత్కరిస్తున్నారు. అయితే, ఈ బంగ్లాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?
పాలి హిల్ బంగ్లా చరిత్ర
మీడియా నివేదికల ప్రకారం, ఈ బంగ్లా ఉన్న ప్లాట్ మొదట రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్ యాజమాన్యంలో ఉండేది. తర్వాత రిషి కపూర్, నీతూ కపూర్ లకు వచ్చింది. దీనిని ఇప్పుడు రణబీర్ కపూర్, అలియా భట్‌లకు అప్పగించారు. ఈ బంగ్లాకు రణబీర్ దివంగత అమ్మమ్మ కృష్ణ రాజ్ కపూర్ పేరు పెట్టారు. బాంద్రాలోని పాలి హిల్ ప్రాపర్టీతోపాటు కపూర్ కుటుంబం గతంలో రాజ్ కపూర్ యాజమాన్యంలోని ఐకానిక్ ఆర్కే స్టూడియో, ముంబై చెంబూర్ ప్రాంతంలోని ఒక బంగ్లాను కూడా వారసత్వంగా పొందింది. ఆ కుటుంబం తరువాత ఈ ప్రాపర్టీలను గోద్రేజ్ ప్రాపర్టీస్‌కు విక్రయించింది.
పాలి హిల్ ప్రాపర్టీ విలువ
బాంద్రాలోని ఉన్నత స్థాయి పాలి హిల్ ప్రాంతంలో కపూర్ కుటుంబానికి చెందిన బంగ్లా, ప్లాట్ విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. “పాలి హిల్‌లో రణబీర్ కపూర్, అలియా భట్ కొత్త బంగ్లా విలువ దాదాపు రూ.350–400 కోట్ల వరకు ఉండవచ్చు” అని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ రితేష్ మెహతా అన్నారు.
పాలి హిల్ తో బాలీవుడ్ కనెక్షన్
బాంద్రాలోని పాలి హిల్ ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మక చిరునామాలలో ఒకటి. అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు నిలయం. ఈ ప్రాంతంలో సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. అమీర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్ వంటి వారు ఉండేది ఇక్కడే. ప్రస్తుతం మన్నత్ పునరుద్ధరణలో ఉన్న నేపథ్యంలో షారుక్ కుటుంబం ఇక్కడే ఉంటోంది. ఈ ప్రాంతం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కూడా నివాసంగా ఉంది. దివంగత దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కూడా ఇక్కడ ఒక బంగ్లాను కలిగి ఉన్నారు.
పాలి హిల్‌లోని లగ్జరీ అపార్ట్ మెంట్ల ధరలు
స్థానిక బ్రోకర్ల ప్రకారం, పాలి హిల్‌లోని లగ్జరీ అపార్ట్ మెంట్ ధరలు కొత్త నిర్మాణాల కోసం చదరపు అడుగుకు రూ.లక్ష నుంచి ప్రారంభమవుతాయి. కొన్ని చోట్ల ఇది రూ.1.30 వరకు కూడా ఉంటుంది.
This website uses cookies.