Categories: LATEST UPDATES

నిర్మాణ రంగంపై పన్ను భారం తగ్గించండి

  • కేంద్రం, ఏపీ సర్కారుకు క్రెడాయ్ వినతి

దేశంలో ఉద్యోగాల కల్పనలో రెండో స్థానంలో ఉన్న నిర్మాణ రంగంపై పన్ను భారం తగ్గించాలని కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను క్రెడాయ్ కోరింది. విజయనగరంలో జరిగిన క్రెడాయ్ మూడు రోజుల ప్రాపర్టీ షోలో క్రెడాయ్ ఏపీ ఉపాధ్యక్షుడు కె.సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. రియల్ రంగానికి అనుబంధంగా ఉన్న దాదాపు 200 సంస్థలను బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తే, నిర్మాణ రంగం మరింతగా అభివృద్ధి చెంది మన ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.

 

ప్రస్తుతం ఏపీలో భూముల మార్కెట్ విలువలు గణనీయంగా పెరిగినందున రిజిస్ట్రేషన్ చార్జీలను 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు. అలాగే మార్కెట్లో ఇసుక ధర యూనిట్ కు దాదాపు రూ.8వేలు ఉందని.. దానిని రూ.2వేల కంటే తక్కువకు ఇవ్వాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం కూడా సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గిస్తే.. సాధారణ ప్రజలు కూడా ఇళ్ల కొనుగోలుకు ముందుకు వస్తాయని సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు.

This website uses cookies.