Categories: LATEST UPDATES

54 ల‌క్ష‌ల‌పై 54 వేలు అద్దె.. అంతా హంబ‌క్కేనా?

ఇన్వెస్టర్లంటే ఫేక్‌గాళ్లకి ఓ మాదిరిగా కూడా కనబడట్లేదనుకొంటా..! పెట్టుబడి పెడితే వేలు, లక్షలు కూర్చోని సంపాదించవచ్చంటూ ఊదరగొట్టడం ఆపట్లేదు. రెజ్‌ న్యూస్‌ ఇలాంటి మాయగాళ్ల గురించి ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తూనే ఉంది. అయినప్పటికీ కొంతమంది కేటుగాళ్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లాంటి సోషల్‌మీడియా పేజీల్లో దందా మొదలుపెట్టారు. అమాయకులే లక్ష్యంగా ఆకర్షణీయమైన ప్రకటనలతో ఇన్వెస్టర్లకు కుచ్చుటోపీ పెట్టడానికి యత్నిస్తున్నారు ఇలాంటి వారంతా.

ఫేస్‌బుక్‌లో ఓ పేజీ ఇలాంటి మోసపూరిత ప్రయత్నాలే చేస్తోంది. నెలకు 54 వేలు అద్దె వస్తుంది. మీరు 54 లక్షలు ఇన్వెస్ట్‌చేస్తే. మంత్లీ రెంటల్‌ ఇన్‌కమ్‌ కావాలనుకునేవారికి కమర్షియల్‌ స్పేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ ఉంది. అపార్ట్‌మెంట్‌లో 54 లక్షలు పెట్టుబడి పెడితే 10 నుంచి 15 వేలు మాత్రమే వస్తాయ్‌. అదే కమర్షియల్‌ స్పేస్‌లో పెడితే 54 వేలు రెంట్‌ వస్తుందంటూ ఆశ పెడ్తోంది. విప్రో సర్కిల్‌లో ఈ కమర్షియల్‌ స్పేస్‌ ఉందని చెబుతోన్న ఈ సంస్థ‌.. కాకపోతే కండిషన్స్‌ అప్లై అంటోంది. ఈ 54 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లోన్‌ ద్వారా కాకుండా ఫుల్‌ పేమెంట్‌ ఆప్షన్‌లో మాత్రమే చేయాలని.. అలా పెట్టుబడి పెట్టిన వారికి మాత్రమే ఈ బంపర్‌ ఆఫర్‌ అంటూ బరితెగింపు ప్రకటనలు చేస్తోంది. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు.

This website uses cookies.