హైదరాబాద్‌లో ప్రీలాంచ్ అంటే ప్రజలు పిచ్చిపట్టినట్లు కొంటారని భావించిన వుజ్వల హౌసింగ్ సంస్థ.. రూ. 45 లక్షలకే ఫ్లాట్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అందులోని ఫోన్ నెంబర్లకు కాల్ చేసి రియల్ ఎస్టేట్ గురు ప్రతినిధి పలు వివరాల్ని సేకరించారు. పటాన్చెరు తర్వాత భానూరు తర్వాత వచ్చే పాటి ఘనపూర్‌లో ఆ సంస్థ ఎనిమిది ఎకరాల్లో 520 ఫ్లాట్లను నిర్మిస్తున్నట్లు చెబుతోంది. హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ చేసేవారికి బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. చదరపు అడుక్కీ రూ.3499కే ఫ్లాట్లను విక్రయిస్తోంది. యాభై శాతం సొమ్ము ముందే కడితే రేటు రూ.3,999కే అమ్ముతోంది. అదే 20 శాతం సొమ్ము కట్టేవారికి మాత్రం రూ.4,999 చొప్పున అమ్ముతోంది. హాస్పిటల్స్, స్కూల్, ఐటీ వర్క్ స్టేషన్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ వంటి ఐటీ కార్యాలయాలకు ఇరవై నుంచి ముప్పయ్ నిమిషాల్లో చేరుకోవచ్చే ప్రచారాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ వుజ్వలా హౌసింగ్, ట్రినిటీ వెంచర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కునేవారు అనుమతులన్నీ పక్కాగా ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. ముందే డబ్బులు వీరి చేతిలో పోసి ఆ తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు.
This website uses cookies.