Categories: TOP STORIES

ఏడాదిలో 72 శాతం ఫ్లాట్లను విక్ర‌యించాం

పౌలోమీ ఎస్టేట్స్
డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ రావు

కోకాపేట్ అనూహ్య అభివృద్ధి
ఆకాశ‌హ‌ర్మ్యాలకు భ‌లే గిరాకీ
పైఅంత‌స్తుల్లో కొనేందుకు ఆస‌క్తి

లోగో: హైద‌రాబాద్ గ్రోత్ స్టోరీ

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత హైద‌రాబాద్ రియ‌ల్ రంగం రూపురేఖ‌లు ఒక్క‌సారిగా మారిపోయాయి. దేశంలోని అనేక మెట్రో న‌గ‌రాల కంటే ధీటుగా అభివృద్ధి చెందుతోంది. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో 2014 నుంచి రియ‌ల్ ఎస్టేట్ విలువ‌లు పెరిగాయి. కొత్త రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు న‌గ‌రంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో గ‌జం ధ‌ర సుమారు యాభై వేల నుంచి అర‌వై వేలు ఉండేది. అలాంటిది ఇప్పుడేమో దాదాపు రూ.3 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. అప్ప‌ట్లో కోకాపేట్‌లో చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.3500 ఉన్న ఫ్లాట్ల ధ‌ర ప్ర‌స్తుతం ప‌ది వేలు ప‌లుకుతోంది. ఇంత స్థాయిలో రియ‌ల్ ఎస్టేట్‌లో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అస‌లెవ‌రూ ఊహించ‌లేదు. సానుకూల దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించే స్థిర‌మైన ప్ర‌భుత్వం ఉండటం.. అభివృద్ధి మీదే ప్ర‌ధాన దృష్టి పెట్ట‌డమే ఇందుకు ప్ర‌ధాన కార‌ణాల‌ని చెప్పొచ్చు.

హైద‌రాబాద్ గ్రోత్ స్టోరీని గ‌మ‌నిస్తే.. గ‌త మూడేళ్ల‌లో కోకాపేట్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం మీద వ్య‌క్తిగ‌తంగా అనేక మంది పెట్టుబడుల్ని పెట్టారు. అనేక సంస్థ‌లు ఇక్క‌డ భూముల్ని కొనేందుకు పోటీ ప‌డ్డాయి. వాస్త‌వానికి, 2009లో అప్ప‌టి ప్ర‌భుత్వం గోల్డ‌న్ మైల్ వేలం వేసేంత వ‌ర‌కూ కోకాపేట్ గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అప్ప‌ట్లో ఎక‌రానికి రూ.14 కోట్లు ప‌ల‌క‌గానే చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ప్రాంతం మీద దృష్టి పెట్ట‌డం మొద‌లెట్టారు. ఆత‌ర్వాత ఆర్థిక మాంద్యం, ప్ర‌త్యేకరాష్ట్ర ఉద్య‌మం వ‌ల్ల మార్కెట్ కొంత స్త‌బ్దుగా ఉంది. కానీ, గ‌త మూడేళ్ల నుంచి కోకాపేట్ గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన వేలం పాట‌ల్ని గ‌మ‌నిస్తే.. ఈ ప్రాంతం ఏ స్థాయిలో వృద్ధి చెందే అవ‌కాశ‌ముంద‌నే అంశం ప్ర‌తిఒక్క‌రికీ అర్థ‌మైంది. హైద‌రాబాద్ రియాల్టీ గ్రోత్ స్టోరీలో కోకాపేట్ ముఖ్యభూమిక పోషించింద‌నే చెప్పాలి.

ఆకాశ‌హ‌ర్మ్యాలకు సై..

కోకాపేట్‌లోని గోల్డ‌న్ మైల్ అయినా నియోపోలిస్ అయినా ఆకాశ‌హ‌ర్మ్యాల్ని అధిక శాతం మంది బిల్డ‌ర్లు నిర్మిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. స్కై స్క్రేప‌ర్ల‌లో పై అంత‌స్తుల్లో నివ‌సించ‌డానికి కొనుగోలుదారులు ఆస‌క్తి చూపిస్తున్నారు. మా 55 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్య‌మైన పౌలోమీ ప‌లాజోలో.. ఆరంభించిన ఏడాది లోపే.. దాదాపు 72 శాతం ఫ్లాట్ల‌ను విక్ర‌యించాం. పై అంత‌స్తుల్లో ఫ్లాట్ల‌న్నీ అమ్ముడ‌య్యాయి. అంటే, ఆకాశ‌హ‌ర్మ్యాల్లో నివ‌సించ‌డానికి ప్ర‌జ‌లెంత ఆస‌క్తి చూపిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి, వ‌చ్చే మూడు నుంచి ఐదేళ్ల‌లో కోకాపేట్ అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.

This website uses cookies.