Tiny Dubai Room Listed For Rs 62,000 Monthly Rent
రియల్ ఎస్టేట్ పరంగా దుబాయ్ ఎంత ఖరీదైన ప్రదేశమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ప్రాపర్టీ ధరలు, అద్దెలు ఆకాశాన్నంటుతాయి. తాజాగా ఓ చిన్న గది అద్దెకు సంబంధించిన ప్రకటన చూసి అంతా అవాక్కయ్యారు. రెడీ టూ మావ్ ఇన్ పార్టిషన్ విత్ బాల్కనీ అంటూ ఇచ్చిన ఆ ప్రకటన దుబాయ్ లో అద్దెలు ఎలా ఉంటాయో తెలియజేసింది. ఇరుకైన ఆ చిన్న పార్టిషన్ అద్దె నెలకు 2700 దీరమ్స్ (దాదాపు రూ.62వేలు), 500 దీరమ్స్ (దాదాపు రూ.11,500) డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నెసన్ సర్వీసెస్ ఇన్ స్టా గ్రామ్ లో ఆ యాడ్ పోస్ట్ చేసింది. దుబాయ్ మెరీనాలోని లేడీస్ ఓన్లీ అపార్ట్ మెంట్ లో ఆ ప్రాపర్టీ ఉందని పేర్కొంది.
ఆ గదిలో చిన్న సింగిల్ బెడ్, బెడ్ సైడ్ టేబుల్, ఓ కప్ బోర్డు ఉన్నాయి. వాటికి తప్ప ఇంక ఎలాంటి స్పేస్ లేదు. దానిని పూర్తిగా ఓ గది అని కూడా చెప్పలేం. క్యూబికల్ సైజులో ఉన్న ప్రైవేటు ఏరియా అంటే సరిపోతుందేమో. ఆ రూమ్ చూస్తే అలాగే ఉంటుంది. అంత ఇరుకైన స్పేస్ కి కూడా భారీ మొత్తంలో అద్దె నిర్ధారించడంపై నెటిజన్లు ఒక ఆటాడుకున్నారు. పలువురు బోలెడు సెటైర్లు వేశారు. అది గదా లేక సమాధా? అని ఒకరు కామెంట్ చేస్తే, అద్దె ఓకే.. కానీ అందులో పడుకోవడానికి ప్లేస్ ఏది భయ్యా? అని మరొకరు ప్రశ్నించారు. తమ బాత్ రూములు, బాల్కనీలు కూడా ఆ రూమ్ కంటే పెద్దగా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
This website uses cookies.