హైదరాబాద్ రియాల్టీలో ఫ్లాట్ల అమ్మకాలు పెద్దగా లేవు. ఈ క్రమంలో బిల్డర్లు, డెవలపర్లు ఏం చేయాలి? ఈ కఠిన సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? మార్కెట్లో కొందరు ప్రమోటర్లు ఏం చేస్తున్నారు? అనుభవజ్ఞులైన డెవలపర్లు అమ్మకాల మీద పెద్దగా దృష్టి పెట్టకుండా, నిర్మాణ పనుల్లో పురోగతిని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
టవర్లను అడ్వాన్స్ స్టేజీకి తీసుకెళుతున్నారు. రెండు లేదా మూడు నెలలు ఓపిక చేసుకుని.. నిర్మాణ పనుల మీద ఫోకస్ పెడితే.. మార్కెట్ మెరుగయ్యేసరికి.. నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తుంది. నిన్న వద్దనుకున్న బయ్యర్లే ఆ తర్వాత ఫ్లాట్లను కొనుక్కోవడానికి ముందుకొస్తారనే విషయం సీనియర్ బిల్డర్లకు తెలుసు. అందులో వారిలో అనేక మంది అమ్మకాల గురించి పెద్దగా చింతించట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుని.. నిర్మాణ పనుల్ని చేసుకుంటున్నారు.