poulomi avante poulomi avante

ప్రీలాంచులు త‌గ్గాలి.. మోస‌గాళ్ల భ‌రతం ప‌ట్టాలి..

  • టీఎస్ రెరా ఛైర్మ‌న్‌గా శాంతికుమారి నియామ‌కం
  • ప్రీలాంచులు త‌గ్గుతాయ‌ని అంటున్న నిర్మాణ రంగం
  • జీవో విడుద‌ల చేసిన స్పెష‌ల్ సీఎస్ అర‌వింద్ కుమార్‌
  • భువ‌న‌తేజ‌, ఆర్‌జే గ్రూప్‌, ఏవీ ఇన్‌ఫ్రాకాన్‌,
    యోషితా ఇన్‌ఫ్రా వంటివి ప్రీలాంచ్ సంస్థ‌లే!

ఎట్ట‌కేల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రెరా ఛైర్మ‌న్‌గా సీఎస్ శాంతికుమారిని నియ‌మించింది. గ‌త సీఎస్ సోమేష్‌కుమార్‌ని ఏపీకి బ‌దిలీ మీద వెళ్ల‌డంతో.. రెరాకు కొత్త‌ ఛైర్మ‌న్ ని నియ‌మించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం సీఎస్ శాంతికుమారిని నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ మేర‌కు పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ శుక్ర‌వారం జీవోను విడుద‌ల చేశారు.

రెరా తొలి ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన రాజేశ్వ‌ర్ తివారీ ప‌ద‌వీవిర‌మ‌ణ చేశాక.. సోమేష్ కుమార్‌కు ప్ర‌భుత్వం అద‌న‌పు బాధ్యత‌గా రెరాను అప్ప‌గించింది. ఆత‌ర్వాత క్ర‌మంలో ఆయ‌న సీఎస్ కావ‌డంతో రెరామీద దృష్టి త‌గ్గిపోయింది. ఇదే క్ర‌మంలో హైద‌రాబాద్‌లో ప్రీలాంచుల దందా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలో అనేక‌మంది సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం ప్రీలాంచుల్లో క‌ష్టార్జితాన్ని పెట్టుబ‌డిగా పెట్టి మోస‌పోయారు. ఇప్ప‌టికే సాహితీ, జ‌య గ్రూప్ వంటివి బిచాణా ఎత్తివేయ‌గా.. ఇదే బాట‌లో మ‌రికొన్ని సంస్థ‌లున్నాయి. ఇవి ఎప్పుడు బోర్డు తిప్పేస్తాయేమోన‌ని అందులో పెట్టుబ‌డి పెట్టిన బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.
రెరా కొత్త ఛైర్మ‌న్ ప్రీలాంచ్ మోసాల‌పై దృష్టి సారించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఈ విభాగాన్ని ఇప్ప‌టికైనా గాడిలో పెట్టాలి. ఇప్ప‌టికే ఈ విభాగం అవినీతిలో కూరుకుపోయింద‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. అక్ర‌మాలు చేస్తున్న బిల్డ‌ర్ల‌పై రెరా ఎలాంటి చ‌ర్య‌ల్ని చేప‌ట్ట‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. రాష్ట్రంలో ప్రీలాంచులు చేస్తున్న సంస్థ‌ల జాబితాను రెరా విభాగం సిద్ధం చేసింది. వారి మీద ముక్కుపిండి జ‌రిమానాను వ‌సూలు చేయాల్సిన అవ‌స‌ర‌ముంది. నిజానికి, ప్రీలాంచ్ బిల్డ‌ర్ల నుంచి ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానా వ‌సూలు చేయాలి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో దాదాపు వంద‌కు పైగా సంస్థ‌లు ప్రీలాంచ్ వ్యాపారాల్ని నిర్వ‌హిస్తున్నాయి. వీరి నుంచి ముక్కుపిండి జ‌రిమానాను వ‌సూలు చేస్తే.. ఆయా సొమ్ముతో న‌గ‌రంలో మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేయ‌వ‌చ్చు.

మాజీ సీఎస్ మంచి నిర్ణ‌యం

మాజీ సీఎస్ సొమేష్ కుమార్ ఏపీకి వెళ్లిపోయే ముందు ఒక మంచి నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ప్రీలాంచుల‌ను చేప‌డుతున్న సంస్థ‌ల పేర్ల‌ను పత్రికాముఖంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు మోస‌పూరిత సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల్ని పెట్ట‌కుండా నిలిపివేయ‌వ‌చ్చు. ఇంత మంచి నిర్ణ‌యాన్ని కొత్త సీఎస్ కొనసాగించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇందుకోసం రెరా విభాగంతో క‌లిసి ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించి ఈ విభాగాన్ని స‌రికొత్త దిశ‌లో ముందుకు తీసుకెళ్లాల‌ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు కోరుతున్నారు.

* * భువ‌న‌తేజ‌, ఆర్‌జే గ్రూప్‌, ఏవీ ఇన్‌ఫ్రాకాన్‌, యోషితా ఇన్‌ఫ్రా, ఫార్చ్యూన్ 99 హోమ్స్ వంటి అనేక సంస్థ‌లు ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. ఈ సంస్థ‌ల‌కు రియ‌ల్ రంగంలో పెద్ద‌గా అనుభ‌వం లేకున్నా.. ప్ర‌జ‌ల్నుంచి సొమ్ము తీసుకుని.. భూముల్ని కొనుగోలు చేసి.. వారికే పంగ‌నామాలు పెడుతున్నాయి. ఇప్ప‌టికే సాహితీ, జ‌య గ్రూప్ వంటివి బిచాణా ఎత్తేశాయి. వంద‌లాది మందిని దారుణంగా మోసం చేశాయి. ఈ జాబితాలో మ‌రిన్ని సంస్థ‌లు చేర‌కూడ‌దంటే.. రెరా అథారిటీ త‌క్ష‌ణ‌మే ప్రీలాంచుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకోవాలి. ప్రీలాంచు సంస్థ‌లు బోర్డు తిప్ప‌క‌ముందే ఆయా కంపెనీల నుంచి పూర్తి వివ‌రాలు సేక‌రించాలి. ఇప్ప‌టిదాకా ఎంత‌మందికి ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ విక్ర‌యించారు? ఎంత‌మంది నుంచి ఎన్ని కోట్లు వ‌సూలు చేశారు? మ‌రి, ఆయా సొమ్ముకు త‌గ్గ‌ట్టుగా ప్లాట్లు, ఫ్లాట్ల‌ను అంద‌జేస్తారా? త‌ద‌త‌ర విష‌యాల‌న్నీ బేరీజు వేయాలి. దాని ప్ర‌కార‌మే ఆయా కంపెనీల‌పై త‌గు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించాలి. అందులో కొన్న‌వారికి న్యాయం చేయాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles