poulomi avante poulomi avante

ఆకాశ‌హ‌ర్మ్యాల్లో ఏ అంతస్తులో.. కొనుక్కుంటే బెట‌ర్‌?

 

  • ఆకాశాన్ని తాకేలా హైరైజ్ అపార్ట్ మెంట్స్
  • అపార్ట్ మెంట్ లో ఏ ఫ్లోర్ లో ఫ్లాట్ కొనాలి?
  • క్రింది ఫ్లోర్ లో కొంటే అనుకూలతలేంటి?
  • పై అంతస్తులో ఉంటే ప్రతికూలతలేంటి?

నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. ఎవరైనా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనడానికి మొగ్గుచూపుతున్నారు. అందుకు అనుగుణంగానే ఆకాశాన్ని తాకేలా హైరైజ్ నివాస భవనాలను బిల్డ‌ర్లు నిర్మిస్తున్నారు. అయితే కొత్తగా ఆకాశహర్మ్యాల్లో ఇల్లు కొనేవాళ్లు ఏ ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకోవాలన్నదానిపై కొంత అయోమయం నెలకొంటుంది. కింది ఫ్లోర్ లోనా లేక పై ఫ్లోర్స్ లో ఫ్లాట్ కొనాలా అన్న కొనుగోలుదారుల సందేహాలకు రియల్ రంగ నిపుణులు ఏంచెబుతున్నారో తెలుసుకుందామా..

ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన అపార్ట్ మెంట్ కల్చర్ ఇప్పుడు పట్టణాలకు వచ్చేసింది. సొంతిల్లు కొనుక్కోవాలనుకునే మధ్య తరగతి వారికి బడ్జెట్ లో ఇల్లు దొరక్క‌పోవ‌డంతో అపార్ట్ మెంట్ వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు అపార్ట్ మెంట్స్ అన్నీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండటం, సకల సౌక‌ర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో చాలా మంది అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చాలావరకూ హైరైజ్ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు 25 నుంచి మొదలు ఏకంగా 50 అంతస్తుల‌కు పైగా నివాస భవనాలను నిర్మిస్తున్నాయి. అయితే మొదటిసారి అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనేవారికి అనేక సందేహాలు ఉంటాయి. ఏ అంతస్తులో ఫ్లాట్ కొనుక్కోవాలన్నది ప్ర‌ధాన‌మైంది. చాలా మందికి అపార్ట్ మెంట్ లో ఏ ఫ్లోర్ సౌలభ్యంగా ఉంటుందన్నదానిపై కొంత అయోమయం సహజనంగానే నెలకొంటుంది.

అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ను కొనేముందు ఆ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం, పరిసరాలు, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు వంటివి పరిశీలించాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి బడ్జెట్ తో పాటు భవిష్యత్తులో అభివృద్ధికి సంబంధించిన‌ అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇక ఏ అంతస్తులో ఫ్లాట్ కొనాలన్నది చాలా మందిని తొలిచే ప్రశ్న. సాధారణంగా ఐదు నుంచి పది అంతస్తుల్లోని అపార్ట్ మెంట్ల‌లో ఏ ఫ్లోర్లో తీసుకోవాలన్నది తేల్చుకోవడం కష్టం. అపార్ట్ మెంట్స్ లో అంతస్తుల ఎంపిక విషయంలో వారి వారి అవసరాలు, కుటుంబ సభ్యుల ఇంట్రస్త్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నివాస భవనంలో ఫ్లోర్స్ ఎంపిక సందర్బంగా ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయని చెబుతున్నారు.

కాంక్రీట్ జంగిల్ లా కాకుండా శివార్లలో అపార్ట్ మెంట్ చుట్టూ తగిన ఖాళీ స్థలం ఉండి, పరిసరాల్లో పచ్చదనం ఉంటే క్రింది అంతస్తుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే క్రింది అంతస్తుల్లో గాలీ, వెలుతురు సమృద్దిగా వస్తుందా లేదా అన్నది పరిశీలించుకోవాలి.

ఇంట్లో పెద్దవాళ్లు ఉండి, వారు ప్రతిసారి లిఫ్ట్ లు ఎక్కడం, దిగడం ఇబ్బంది అనుకున్నవారు సైతం క్రింది ఫ్లోర్స్ లో ఉండటమే మేలు. అయితే క్రింది అంతస్తుల్లో ఉంటే అపార్ట్ మెంట్స్ కు వచ్చిపోయే వారి సందడితో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంతే కాకుండా క్రింది ఫ్లోర్స్ లో భద్రతాపరంగా కూడా ఇబ్బంది ఉండవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి.

తరచూ ఇల్లు మారే వారికి ఇంటికి సంబంధించిన సామగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి అలాంటి వారికి సౌలభ్యంగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యానికి సంబంధించి అత్యవసరమైన పరిస్థితి ఎదురైనప్పుడు క్రింది అంతస్తులో ఉంటే వేగంగా క్రిందికి దిగవచ్చు. మిగతా సమయంలో లిఫ్టుల కోసం పెద్దగా వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

ఇక కాస్త థ్రిల్ కోరుకునే వారు పై అంతస్తుల్లో కొనుక్కోవడం మేలంటున్నారు రియల్ రంగ నిపుణులు. ప్రధానంగా పై ఫ్లోర్స్ లో ఉంటే గాలి, వెలుతురు కావాల్సినంత వస్తుంది. బాల్కనీల్లోంచి చూస్తే చుట్టూ పరిసరాలన్నీ కనిపిస్తూ అద్భుతమైన అనుభూతినిస్తాయి.

20 అంతస్తులపైన సౌండ్ పొల్యూషన్ ఉండదు. పై అంతస్తుల్లోకి దోమలు కూడా రావని చెబుతున్నారు. ఇక 30 అంతస్తుల పైనుంచి చూస్తే నగరం అంతా కనిపించడంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పై అంతస్తుల్లో ఉంటే మిగతా వారి రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అంతే కాకుండా భద్రతాపరమైన సమస్యలు పెద్దగా ఎదురు కావ‌ని నిపుణులు చెబుతున్నారు. పైగా పై అంతస్తులో నివసించడం అంటే ఇప్పుడు సమాజంలో హోదా గా భావిస్తున్నారు. అయితే పై ఆంతస్తుల్లోంచి ప్రతిసారి క్రిందకు రావాలంటే లిఫ్టుల్లోనే టైం గడిచిపోతుంది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో క్రిందికి రావాలంటే సమయం పడుతుంది.

హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో పై అంతస్థుల్లో కొన్ని అనుకూలమైన, మరికొన్ని ప్రతికూలమైన అంశాలుండగా, అదే విధంగా క్రింది అంతస్తుల్లోను ప్లస్ లు మైనస్ లు ఉన్నాయి. అందుకే ఎవరి కుటుంబ అవసరాలు, పరిస్థితులు, అభిరుచులను బట్టి అన్ని బేరీజు వేసుకున్నాక ఏ ఫ్లోర్ లో ఉండాలో తేల్చుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇటు క్రింది అంతస్తుల్లో, అటు పై అంతస్తుల్లో ఉండటంపై ఏటూ తేల్చుకోలేక పోతే మాత్రం మధ్య అంతస్తుల్లో ఫ్లాట్ కొనుక్కోవాలని సూచిస్తున్నారు. అంతా కాకుండా ఇప్పుడు హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో అంతస్తులు పెరిగిన కొద్ది చదరపు అడుగు ధర కూడా పెరుగుతుందన్న విషయాన్ని కొనుగోలుదారులు గుర్తుపెట్టుకోవాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles