మహారాష్ట్రలోని జాతీయ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ మండలి (ఎన్ఏఆర్ఈడీసీఓ) మరింత బలోపేతం అయింది. తాజాగా బృహన్ ముంబై డెవలపర్స్ అసోసియేషన్ (బీడీఏ), సెంట్రల్ డెవలపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీఎండీడబ్ల్యూఏ) ఎన్ఏఆర్ఈడీసీఓలోకి విలీనం అయ్యాయి. ఈ రెండు అసోసియేషన్లలో 750 మందికి పైగా సభ్యులున్నారు. వీరంతా రావడంతో ఎన్ఏఆర్ఈడీసీవోలో సభ్యుల సంఖ్య 4వేలు దాటింది. ఎన్ఏఆర్ఈడీసీఓలోకి రావడం వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని సీఎండీడబ్ల్యూఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ధర్మేష్ చెద్దా పేర్కొన్నారు. ప్రస్తుతం డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కొత్తగా ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఎన్ఏఆర్ఈడీసీఓ జాతీయ అధ్యక్షుడు రంజన్ బండేల్కర్ తెలిపారు. అద్దెదారుల ఫ్లాట్ల రీ డెవలప్ మెంట్ పై జీఎస్టీ, జీఎస్టీలో ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్, క్లస్టర్ రీడెవలప్ మెంట్ తదిర అంశాలను ఆ కమిటీ చూస్తుందన్నారు.