భారతీయ నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థగా అపర్ణా కన్ స్ట్రక్షన్స్ ఖ్యాతినార్జించింది. హైదరాబాదు, బెంగళూరు మరియు అమరావతిలలో బెస్ట్-ఇన్-క్లాస్ గేటెడ్ కమ్యూనిటీలను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడంపై దృష్టి సారించడంతో పాటు.. నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకుండా మరియు ఉద్యోగుల నియామకంలో అత్యుత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటూ, దేశ చరిత్రలోనే ప్రముఖ బిల్డర్లలో ఒకటిగా అపర్ణా స్థిరపడింది. ఆర్కిటెక్చర్, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంది.
1996 నుంచి నిర్మాణాల్ని ఆరంభించిన అపర్ణా కన్‌స్ట్రక్షన్స్.. 18000+ కంటే ఎక్కువ సంతృప్తి చెందిన కస్టమర్‌లను కలిగి ఉంది. విల్లాలు, అపార్టుమెంట్లు మరియు వాణిజ్య భవనాల యొక్క పూర్తి-సమీకృత గేటెడ్ కమ్యూనిటీలతో కూడిన 48 ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులు 24.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటం విశేషం. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను అదనంగా 25 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తోంది. అపర్ణా ISO 9001:2015, ISO 14001:2015 & OHSAS 45001:2018 సర్టిఫైడ్ కంపెనీ. హైదరాబాద్‌లో మోర్గాన్ స్టాన్లీ మరియు జేపీ మోర్గాన్‌తో భాగస్వామి అయిన మొదటి కంపెనీ కూడా అపర్ణా కన్ స్ట్రక్షన్స్ కావడం గమనార్హం.
నిర్మాణాల్లో నాణ్యత మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అపర్ణా కన్ స్ట్రక్షన్స్ నిరంతరం వినూత్న విధానాల్ని అమలు చేస్తోంది. అందుకే, ఈ కంపెనీ భారత నిర్మాణ రంగంలో తమ ప్రత్యేకతను చాటి చెబుతోంది. కస్టమర్ సెంట్రిక్ విధానం, దృఢమైన ఇంజనీరింగ్, అంతర్గత పరిశోధన, రాజీపడని వ్యాపార నైతికత, కాలాతీత విలువలు మరియు వ్యాపార ప్రవర్తన.. ఇలా అన్ని రంగాల్లో అపర్ణా పారదర్శకతను నెలకొల్పి.. ఇండియాలోనే అత్యుత్తమ రియల్ ఎస్టేట్ బ్రాండ్ గా అవతరించింది.
ప్రపంచ ప్రమాణాల్ని పాటిస్తూ..
అపర్ణా కన్ స్ట్రక్షన్స్ 1996 నుంచి గేటెడ్ కమ్యూనిటీలలో మార్గదర్శక ఆవిష్కరణల్ని చేపడుతూ ముందుకు దూసుకెళుతోంది. కొనుగోలుదారుల స్థోమత మరియు లగ్జరీ మధ్య స్థిరమైన సమతుల్యతను పాటిస్తూ.. ప్రతిఒక్కరి హృదయాన్ని ఆకర్షించే గృహాల్ని అందజేస్తోంది. పర్యావరణ బాధ్యతను పాటిస్తూ.. ప్రపంచ నిర్మాణ ప్రమాణాల గృహాల్ని నిర్మిస్తోంది.