ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెక్షన్ 9 లోని సబ్ సెక్షన్ (2) ప్రకారం రెరాలో నమోదు చేసుకోవాలి. ఫారమ్ జి ద్వారా దరఖాస్తు చేసుకుని కొన్ని వివరాలు సమర్పించాలి
- సంస్థ లేదా వ్యక్తి పేరు, చిరునామా, సంస్థ ఎలాంటి రకానికి (యాజమాన్యం, సొసైటీలు, భాగస్వామ్యం, కంపెనీ తదితరాలు)
- సంస్థ రిజిస్ట్రేషన్ వివరాలు (యాజమాన్య సంస్థగా, భాగస్వామ్యంగా, కంపెనీ, సొసైటీ మొదలైనవి) ఉప చట్టాలు, మెమోరాండమ్ సహా సంఘం యొక్క వ్యాసాలు మొదలైనవి.
- రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక వ్యక్తి అయితే.. అతడు లేదా ఆమె పేరు, చిరునామా, సంప్రదింపు వివరాలు, ఫొటో.. అదే సంస్థ అయితే, భాగస్వాములు, డైరెక్టర్లు మొదలైనవారి వారి పేర్లు, ఫొటోలు, సంప్రదింపు వివరాలు
- రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాన్ కార్డు కాపీ
- వ్యాపార స్థలం చిరునామా ధ్రువీకరణ పత్రం
- ఈ వివరాలన్నింటితో రియల్ ఎస్టేట్ ఏజెంటుగా నమోదు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- ఏదైనా షెడ్యూల్ బ్యాంకులో తీసుకున్న డీడీ లేదా బ్యాంకర్స్ చెక్ ద్వారా లేదా ఆన్ లైన్ చెల్లింపు ద్వారా దరఖాస్తుదారు వ్యక్తి అయితే రూ.10వేలు, సంస్త అయితే రూ.50వేలు చెల్లించాలి.
- నిబంధన 8 కింద దరఖాస్తు అందిన తర్వాత రెరా 30 రోజుల వ్యవధిలో సదరు ఏజెంటుకు రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం లేదా దరఖాస్తు తిరస్కరించడం జరుగుతుంది.
- ఒకవేళ దరఖాస్తులో ఏవైనా లోపాలుంటే వాటిని సరిదిద్ది మళ్లీ సమర్పించే అవకాశం ఇస్తుంది.
- రియల్ ఎస్టేట్ కింద నమోదైన ఏజెంటుకు దాని కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుంది.
- ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత మళ్లీ నిర్దేశిత పత్రాలు, ఫీజు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తుతోపాటు వ్యక్తి అయితే రూ.5వేలు, సంస్థ అయితే రూ.25 వేలు చెల్లించాలి.