poulomi avante poulomi avante

హ‌మారే పీచే కౌన్ హై మాలూమ్‌?

Hamare peechey koun hai maalum? Few Companies are taking names of KTR, Kavitha, Local Mla's, Top Political Leaders and doing Pre Launch Scams in the city.

  • అక్రమార్కుల మాయాజాలం
  • ప్రభుత్వ పెద్దల పేర్లతో దోపిడీ
  • అధికారులు తమ చుట్టమన్నట్లుగా ముచ్చట్లు
  • శివారు ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న దందా
  • కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న అక్రమార్కులు
మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ కవిత.. మా చుట్టాలు, చాలా దగ్గరి బంధువులు.
వారితో మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. మేం ఏం చెబితే అదే ఫైనల్.
అంతెందుకు ఈ వెంచర్ వారిదే. ఈ విల్లా ప్రాజెక్ట్ వారిదే. మేము జస్ట్ నామమాత్రమే. ఏదో ఎండీగా మీ ముందున్నాం. మేం రెగ్యూలర్‌గా వారితో కలిసి ఉంటాం. మా వెంచర్‌కు ఆటోమెటిగ్గా పర్మిషన్లు వస్తాయి. మీ డబ్బుకు మాదీ గ్యారంటీ.

ఇలా మాయమాటలు చెబుతూ కొంద‌రు అక్ర‌మార్కులు.. రియల్ ఎస్టేట్‌లో జోరుగా అక్రమ దందాను నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. అయితే అసలు ఇలా చెబుతున్న రియల్ ఎస్టేట్ అక్రమార్కులతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఎలాంటి సంబంధాలు లేవు. కనీసం వారి పేరు, ఫేస్ కూడా తెలియదు. కానీ వీరి పేరు చెప్పి రూ. 200 కోట్లకు పైగా పలు కంపెనీలు వసూళ్లు చేశాయి. ఉదాహ‌ర‌ణ‌కు మియాపూర్ కేంద్రంగా పని చేసే యోషితా ఇన్‌ఫ్రాను తీసుకుంటే.. ఈ సంస్థ ఏకంగా ఓ మ‌హిళా నాయ‌కురాలు త‌మ వెన‌క ఉన్నారంటూ ప్ర‌చారం చేస్తూ.. ప్రీలాంచ్ అమ్మ‌కాల్ని జ‌రుపుతోంది. తమర్ని ఎవరూ టచ్ చేయలేరని.. అంతా తనే చూసుకుంటారనే ప్రచారం జరుపుతోందీ యోషితా ఇన్ఫ్రా. ఇటీవ‌ల అరెస్టు అయిన జయ గ్రూప్ సంస్థ ఎండీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక‌, బౌరంపేట్‌, సుల్తాన్‌పూర్‌, మ‌ల్లంపేట్ వంటి ప్రాంతాల్లో ఓ రాజ‌కీయ నాయకుడి అండతో చాలామంది రియ‌ల్ దందాల్ని నడిపిస్తార‌ని తెలిసిందే.

భాగ్యనగరం అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే శివారు ప్రాంతాలు నగరంలో కలిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డును దాటి నగరం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్టుమెంట్లు, వెంచర్లలో పాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎక్కువగా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే అమ్ముతున్నారు.

కొనుగోలుదారులకు ఆ వెంచర్ ఎండి, మంత్రి కేటీఆర్ లేదా ఎమ్మెల్సీ కవిత లేదా మంత్రులు.. ఇలా ఎవరో ఒక్కరు చాలా దగ్గరని నమ్మకాన్ని క‌లిగిస్తున్నారు. అవసర‌మైతే ఆ వెంచర్ కానీ ఆ ప్రాజెక్టు కానీ ప్రభుత్వంలోని పెద్దలదే అని కూడా బుకాయిస్తున్నారు. పర్మిషన్లు వాటంతట అవ్వే వస్తాయంటూ మాయ మాట‌లు చెబుతున్నారు. వారికి న‌మ్మ‌కం క‌లిగేలా మాట్లాడుతూ కొనుగోలు చేసేలా చేస్తున్నారు. కాక‌పోతే, ఇక్కడ అలాంటి అక్రమాల వెంచర్లలో ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి సంబంధాలు లేవు అన్నది నిజం. కానీ ఉన్నట్లు సీన్ క్రియేట్ చేసి గద్దలా డబ్బును తన్నుకు పోతున్నారు.

వెంచర్ చిన్నది.. కానీ 3 వేల మంది సిబ్బంది

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా.. కోకాపేట్, చేవెళ్ల, సదాశివపేట్, షాద్ నగర్, జహీరాబాద్, యాదాద్రి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘట్ కేసర్, బీబీనగర్, చౌటుప్పల్, చిట్యాల, శామీర్‌పేట్, శంషాబాద్, కడ్తాల్, అమన్‌గల్ పరిసర ప్రాంతాల్లోనే సాగుతుంది. ఇక్కడ వెలిసిన వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టుల్లో 90 శాతం వాటికి అసలు పర్మిషన్లు లేవు. కొందరు అయితే పాత ఎల్పీ నెంబర్ వేసి కొత్త వెంచర్‌ను అమ్ముతున్నారు.

కొంత మంది డెవలపర్లు ఏకంగా రెండు మూడు ఫ్లోర్ల‌లో, దాదాపు 3000 మంది మార్కెటింగ్ సిబ్బందిని పెట్టి కొనుగోలుదారులకు కట్టబెడుతున్నారు. మాయమాటలను నమ్మిన ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏళ్లు గడుస్తున్న వెంచర్లకు పర్మిషన్లు రాకపోవడంపై అక్రమార్కులను ప్రశ్నిస్తున్నారు. మాకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది ఏమి లేక బాధితులు వెను దిరుగుతున్నారు.

అధికారులు పని చేస్తున్నారా?

ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి అక్రమంగా అమ్ముతున్నట్లు హెచ్ఎండిఏ, డీటీసీపీ, రెరా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వానికి మచ్చగా మారుతున్న ఇలాంటి తతంగాన్ని మొదట్లోనే కట్టడి చేస్తే బాగుంటుందని బాధితులు తెలుపుతున్నారు. తమకు మంత్రి కేటీఆర్ పై పూర్తి నమ్మకం ఉంది.. అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. అయితే మంత్రి పేరు చెప్పి అమ్ముతున్న వెంచర్లపై చర్యలు తీసుకోకపోవడం మాత్రం తమను నిర్లక్ష్యానికి గురి చేస్తుందని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి అక్రమాలను ఆదిలోనే అంతం చేయకపోతే ఓ సాహితీనో, ఇంకో జయ గ్రూప్ లానో బాధితులు రోడ్డున పడే పరిస్థితే ఉంటుందని తెలుపుతున్నారు.

బోర్డు తిప్పేసే పనిలో పలు కంపెనీలు..

ప్రచారం కొండంత. డెవలప్‌మెంట్ గోరంత. ఆకాశంలో మేడలు కడతారు. వెంచర్లలో కనీసం రోడ్డు కూడా ఉండదు. పాంప్లేట్, వెబ్‌సైట్‌లలో గ్రాఫిక్స్‌తో మాయా జాలం చేస్తారు. వాస్తవానికి అది ఊహే.. దానికి రూపం లేదని అక్రమ వెంచర్ దారులు నిరూపిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్న ఇంతవరకు పర్మిషన్లు కూడా రాని వెంచర్లు 90 శాతం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకోక్క డెవలపర్ దాదాపు 10 వెంచర్లు వేస్తే.. అందులో ఒక‌టి లేదా రెండింటికి మాత్రమే అన్ని పర్మిషన్లు ఉంటున్నాయి. మిగతావి అన్ని అక్రమ వెంచర్లే.

కానీ పర్మిషన్లు ఉన్న వాటిని చూపించి వెంచర్లను అమ్ముతున్నారు. నిషేధిత భూములను ఆక్రమించి దందా చేస్తున్నారు. ఇక అవి కావు అని తెలిసి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక.. కస్టమర్లకు సమాధానాలు చెప్పలేక దాట వేస్తున్నారు. త్వరలోనే పలు కంపెనీలు బోర్డు తిప్పేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంత మంది రియ‌ల్ట‌ర్లు కొత్త కంపెనీలను సైతం ప్రారంభించారు. మరి మీరు పెట్టుబడి పెట్టిన వెంచర్, విల్లా ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా? బోర్డు తిప్పేసే కంపెనీల జాబితాలో మీ కంపెనీ ఉందా? తస్మాత్ జాగ్రత్త.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles