- స్మార్ట్ టైన్ షిప్స్ లో ఎక్కడైనా
- ఫ్లాట్ కొనుక్కునే అవకాశం
ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్ కొనుక్కునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడ పని చేస్తున్నా.. వారు కోరుకున్న చోట ప్లాట్ తీసుకోవచ్చు. గతంలో ఉద్యోగులు పని చేస్తున్న ప్రాంతంలో ఉన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో మాత్రమే ప్లాట్ కొనుగోలు చేసే వీలుండేది. అయితే, ఉద్యోగుల వినతుల మేరకు ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడైనా ప్లాట్ తీసుకునే అవకాశం ఉద్యోగులకు లభించనుంది.
ఏపీలో మొత్తం 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇందులో ప్లాట్లు మార్కెట్ ధర కంటే తక్కువకే ఉంచింది. ప్రజలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో ప్లాట్లు కొనుక్కోవచ్చు. ఈ లేఔట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వు చేయడంతోపాటు ధరలో 20 శాతం రాయితీ కూడా కల్పించింది. మరిన్ని వివరాలకు https://migapdtcp.gov.in వెబ్ సైట్ చూడొచ్చు