- కలలు వాస్తవాలుగా మారే ప్రదేశం<//li>
- ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
- క్రెడాయ్ ఎలక్ట్ ప్రెసిడెంట్ కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానిక్రెడాయ్ ఇండియా ఎలక్ట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బొమన్ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ఆయన ఓ సందేశం పంపించారు. గత కొన్నేళ్లుగా క్రెడాయ్ తో మీ అనుబంధం శాశ్వతమైనదని, రాబోయే సంవత్సరాల్లోనూ ఇది కొనసాగుతుందని కచ్చితంగా అనుకుంటున్నాని ప్రధాని పేర్కొన్నారు.
- గృహ నిర్మాణం ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యంత ముఖ్యమైన రంగాల్లో ఒకటని.. భారతదేశ వృద్దికి పునాదిని నిర్మిచండానికి ఇది ఓ సాధనమని అభిప్రాయపడ్డారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని.. కలలు వాస్తవాలుగా మారే, ఆకాంక్షలు నెరవేరే ఓ ప్రదేశమని అభివర్ణించారు. గత తొమ్మిదేళ్లుగా రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి, సంస్కరించడానికి తాము ఎన్నో చర్యలు తీసుకున్నామని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు.
సరసమైన గృహాలకు ప్రాధాన్యత ఇస్తూ.. అందరికీ ఇళ్ల అనే దృక్పథంతో కోట్లాది మందికి సొంత ఇళ్లతో సాధికారత కల్పించినట్టు చెప్పారు.
- అమృత్ కా వన్ అనేది కొత్త భారతదేశాన్ని నిర్మించడానికి ఓ అవకాశమన్నారు. ఈ నేపథ్యంలో క్రెడాయ్ వంటి సంస్థల పాత్ర మరింత ఔచిత్యాన్ని సంతరించుకుందని వ్యాఖ్యానించారు. రియల్ రంగంలో పారదర్శకత, సుస్థిరత, హరిత నిర్మాణ సాంకేతికతలను పెంపొందించడంపై క్రెడాయ్ దృష్టి సారిస్తుందని భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. దేశ పురోగతికి క్రెడాయ్ మరింత అర్థవంతమైన సహకారం అందించడంలో సాయపడటానికి మీరు కృషి చేస్తారని విశ్వసిస్తున్నట్టు బొమన్ ఇరానీకి పంపిన లేఖలో ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.