తెలంగాణ రాష్ట్రంలో కొన్ని డిజిటల్ మీడియా ఛానెళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. చెరువు పక్కన స్థలముంటే చాలు.. అక్కడ భవనాల్ని నిర్మించే నిర్మాణ సంస్థల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియోలు చేస్తున్నాయి. ఉదాహరణకు, మైసమ్మ చెరువును వాసవి సంస్థ కబ్జా చేసి.. అక్రమ కట్టడాల్ని కడుతుందంటూ కొందరు పని గట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా.. తలాతోకా లేకుండా.. ఏదీపడితే అది మాట్లాడుతూ.. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. మైసమ్మ చెరువుకు కొంచెం దూరంలో.. మరో నిర్మాణ సంస్థ నిర్మాణం చేపడుతుంటే..
అది కూడా వాసవి గ్రూప్ కడుతోందంటూ తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వాస్తవాల్ని గమనిస్తే.. కూకట్‌పల్లిలోని మైసమ్మ చెరువు సుందరీకరణ పనుల్ని చేయాలంటూ గత ప్రభుత్వం వాసవి సంస్థకు అప్పగించింది. ఇలా మొత్తం యాభై చెరువుల్ని సీఎస్సార్ కింద డెవలప్ చేయాలంటూ అప్పటి ప్రభుత్వమే యాభై మంది బిల్డర్లకు అందజేసింది. అయితే, ఇదేదో వాసవి సంస్థ చెరువును కబ్జా చేసి.. నిర్మాణ పనుల్ని చేపడుతుందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ కథనాల్ని ప్రచురించడం కరెక్టు కాదు. ఇలా బ్లాక్ మెయిల్ చేసే ఛానెళ్ల పై న్యాయపరమైన చర్యల్ని తీసుకుంటామని వాసవి సంస్థ అడుగు ముందుకేస్తోందని సమాచారం.
This website uses cookies.