ఫ్లాట్లు అమ్ముడు కావడం లేదని బలవన్మరణానికి పాల్పడిన యువ బిల్డర్ ముత్యాల వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని టీబీఎఫ్ సంఘం పలకరించింది. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి సానుభూతిని తెలియజేసింది. తోటి బిల్డర్లుగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలియజేసింది. ఈ సందర్భంగా టీబీఎఫ్ అధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్‌కు చెందిన ముత్యాల వేణుగోపాల్‌రెడ్డి పదమూడేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని తెలిపారు.
ఇటీవల ఒక స్థలాన్ని కొనుగోలు చేసి.. దాదాపు ఎనభై శాతం నిర్మాణాన్ని పూర్తి చేశారని.. కాకపోతే, అమ్మకాల్లేకపోవడంతో.. అప్పుల బాధలు తాళ్లలేక.. నిర్మాణం చేసిన అపార్టుమెంట్‌లోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వేణుగోపాల్‌రెడ్డికి ఐదేళ్ల కూతరు ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నిర్మాణ సంఘాలన్నీ ముందుకొచ్చి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో టీబీఎఫ్‌ఖ ఉపాధ్యక్షులు విద్యాసాగర్, మారం సతీష్ కుమార్, రాజిరెడ్డి, గోపాల్, మోహన్ రావు తదితర సభ్యులున్నారు.
This website uses cookies.