ఏపి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో చైర్మన్, నలుగురు మెంబర్ పోస్టుల నియామకానికి.. పురపాలక శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు అర్హతల గురించి ప్రత్యేకంగా వెల్లడించారు. ఆర్థిక, సామాజిక, పట్టణాభివృద్ధి, హౌసింగ్, న్యాయశాస్త్రం, పరిశ్రమ, రియల్ ఎస్టేట్, ప్రజా వ్యవహారాలు, పరిపాలన తదితర రంగాల్లో ఛైర్మన్‌కు ఇరవై సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. సభ్యుడైతే పదిహేను సంవత్సరాలుండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ap.gov.in వెబ్‌సైటులో పొందుపరిచారు. మే నెల 7వ తేదీ సాయంత్రం 5లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
This website uses cookies.