హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్‌కి హబ్‌గా మారుతోంది. జీసీసీలంటే పెద్ద కంపెనీలకు అసిస్టెంట్ పనులు చేసేవేగా అన్న పేరు నుంచి సర్వీస్ ప్రొవైడర్లుగా మారాయిప్పుడు. అంటే సంస్థకు సంబంధించిన నిర్ణయాల్ని ఇక్కడే తీసుకునే స్థాయిలో సంస్థలు ఏర్పాటవుతున్నాయి. కోట్ల రూపాయలు పెట్టుబడులు.. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తుండటంతో దేశాలన్నీ ఈ జీసీసీల కోసం పోటీ పడుతున్నాయ్. ఇండియాలో అయితే జీసీసీలను ఆకర్షించే విషయంలో హైదరాబాద్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రారంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని జీసీసీలు భాగ్యనగరానికి క్యూ కడతాయంటున్నారు.
విభిన్న ఆలోచనలు- కొత్త అవకాశాలకి, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి డోర్స్ ఓపెన్ చేస్తున్నాయ్. టెక్నాలజీ సెక్టార్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా జీసీసీలు మారాయి. కంపెనీల హెడ్ క్వార్టర్స్‌కి ఔట్‌సోర్సింగ్, ప్రాసెస్ సర్వీసెస్‌ని అందించడానికి ఇతర దేశాల్లో ఏర్పాటు చేసే ఈ సహాయ కేంద్రాలు- సంస్థలకి భారీ ఆదాయాలు సమకూర్చి పెడుతున్నాయ్. ఆదాయంతో పాటు ఉపాధి కల్పిస్తుండటంతో ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను దక్కించుకోడానికి అందరూ పోటీ పడుతున్నారు. ప్రపంచ దేశాలతో పొల్చితే ఇండియా ఇప్పటికే జీసీసీలకు క్యాపిటల్‌గా మారుతోంది. ఫ్యూచర్‌లో మరిన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏర్పాటు అవుతాయని.. 2025లో వీటి ఏర్పాటులో 14 శాతం వృద్ధి ఉంటుందని ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. అంతేనా జీడీపీలో 4.5 శాతం వాటా జీసీసీలదే అని చెబుతున్నారు. ఇక భారత్‌లోని ఐటీ/ఐటీఈఎస్/ఐసీటీ సెక్టార్లలో జీసీసీలు భారీ ఆదాయాలను నమోదు చేస్తున్నాయ్.
భారత్‌లో ఈ జీసీసీల కోసం రాష్ట్రాలన్నీ విపరీతంగా పోటీ పడుతున్నాయ్. అయితే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ హబ్‌లుగా ఉన్న స్టేట్స్‌ని కాదని హైద్రాబాద్ వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇక దేశంలోని జీసీసీల్లో 20 శాతం హైద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవే. అంతేనా.. వారానికో జీసీసీ కంపెనీ హైద్రాబాద్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాయ్. దీంతో భాగ్యనగరం జీసీసీ హబ్‌గా మారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చంటున్నారు. మేజర్ సిటీస్‌ని వెనక్కి నెట్టేసి మరీ హైద్రాబాద్ విదేశీ కంపెనీలని ఆకర్షించగలుగుతోంది.
భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న జీసీసీలు వాటి ఆదాయాలు చూస్తే- మైక్రోసాఫ్ట్ ఆదాయం 2020లో 4 వేల 872 కోట్ల రూపాయలుండగా.. 2024లో 15 వేల 317 కోట్ల రూపాయలుగా ఉంది. డెలాయిట్ కన్సల్టింగ్ రెవిన్యూ 2020లో 6 వేల 503 కోట్ల రూపాయలుండగా.. 2024లో 15 వేల 275 కోట్లను టచ్ చేసింది. వెల్స్ ఫార్గో రెవిన్యూ 2020లో 4 వేల 252 కోట్ల రూపాయల నుంచి 2024లో 13 వేల 426 కోట్ల రూపాయలు నమోదు చేసింది. సిటీ బ్యాంక్- ఆదాయం 2020లో 4 వేల 241 కోట్ల రూపాయలు కాగా.. 2024లో 12 వేల 123 కోట్ల రూపాయలు. వాల్‌మార్ట్ రెవిన్యూ 2020లో 2 వేల కోట్ల రూపాయల నుంచి 2024లో 8 వేల 665 కోట్ల రూపాయలుగా రికార్డైంది. వీటితో పాటు..
వెల్స్‌ఫార్గో, జీఈ, ఎజిలీసియం, సోనోకో జీసీసీ, డార్క్ మేటర్స్ టెక్నాలజీ, మెక్ డోనాల్డ్స్, కార్లాన్ గ్లోబల్ సొల్యూషన్స్, హెచ్‌ఎస్‌బీసీ, ప్రొవిడన్స్ హెల్త్‌కేర్, సిటీ గ్లోబల్ సర్వీసెస్ ఇండియా, సిటిజెన్స్‌ఫైనాన్షియల్ గ్రూప్.
ఫార్మా కంపెనీల జీసీసీలను ఆకర్షించడంలోనూ ముందుంది హైద్రాబాద్. నగరానికి వచ్చిన ఫార్మా జీసీసీల్లో.. ఎలీ లిల్లీ, బ్రిస్టల్ మేర్స్ స్క్విబ్, నొవార్టిస్, సనోఫి, అమ్‌జెన్, రోష్, బేయర్, మెర్క్ ఎంఎస్‌డీ, జీఎస్‌కే, థెర్మో ఫిషర్ సైంటిఫిక్, మెడ్‌ట్రోనిక్, శాండోజ్ వంటివి ఉన్నాయి.
ఆల్రెడీ ఐటీని హైదరాబాద్ దున్నేస్తోంది. అలాగే బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ రంగాలకి సైతం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులు తరచూ కంపెనీలు మారుతుండటంతో కంపెనీలు తమ జీసీసీలని హైద్రాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయ్. ఫ్యూచర్ అంతా ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్‌లదే. అలాగే టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్సల్టింగ్ రంగాలకూ డిమాండ్ ఉంది. వీటిల్లో నైపుణ్యం సాధిస్తే చాలు కంపెనీలు వెతుక్కుంటూ వచ్చి జీసీసీలను నెలకొల్పడంతో పాటు ఉద్యోగులకు భారీ జీతాలు ఆఫర్ చేయడం ఖాయం. ఈ రంగాలకు చెందిన నిపుణుల లభ్యత పుష్కలంగా ఉంది కాబట్టే జీసీసీల్లో హైద్రాబాద్‌కు అంత డిమాండ్.
కోకాపేట్‌లో జీసీసీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ప్రీమియం గృహాలకు ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. 2023తో పోల్చితే 2024లో.. ప్రీమియం హౌసింగ్ విభాగంలో దాదాపు 86 శాతం వృద్ధి నమోదైంది. 2023లో 32,530 ఇళ్లు అమ్ముడుపోగా.. 2024లో సుమారు 35, 414 ఇళ్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. అడ్వాన్సులిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోని వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో ఆకాశహర్మ్యాలకు క్రమక్రమంగా డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. ఎందుకంటే, భవిష్యత్తులో కోకాపేట్ ఓ విదేశీ నగరంగా డెవలప్ అయ్యేందుకు పూర్తి అవకాశముంది. ఈ అంశాన్ని గ్రహించిన ప్రస్తుత ప్రభుత్వం కోకాపేట్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది.
This website uses cookies.