అన్వితా గ్రూప్ ఎండీ అచ్యుతరావు మనసులో ఒకటే ఉంటుంది. ఎప్పుడూ కొనుగోలుదారులకు కొత్త సౌకర్యం అందించాలని భావిస్తారు. అలాంటి బిల్డర్ ప్రాజెక్టును ఆర్కిటెక్టుగా డిజైన్ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే, హైదరాబాద్‌లో సరికొత్త సౌకర్యాల్ని అందించే అవకాశం ఆయన ద్వారా నాకు ప్రత్యేకంగా దక్కినందుకు ఆనందంగా ఉందని ఎస్సెన్స్ ఆర్కిటెక్స్ ఎండీ ఎం సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. కొల్లూరులోని అన్వితా ప్రాజెక్టుకు చీఫ్ ఆర్కిటెక్టుగా వ్యవహరించిన ఆయన రియల్ ఎస్టేట్ గురుకు ప్రత్యేకం ఇంటర్వ్యూనిచ్చారు. మరి సత్యానారాయణ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..
మా తాతముత్తాతలు వాస్తు సిద్ధాంతులు. వారు జ్యోతిష్యం, వాస్తు మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు. పైగా, నేను చిన్నప్పట్నుంచి కళల పట్ల ఆసక్తి ఉండేది. అవన్నీ నిగూడంగా నాలో ఉండటం వల్లే.. ఆర్కిటెక్చర్ వైపు సహజంగానే ఆసక్తి పెరిగిందని అనుకుంటున్నాను. మా స్వస్థలం ఈస్ట్ గోదావరిలోని కె.జగన్నాధపురం. అక్కడే పాఠశాల విద్యను అభ్యసించాను. ఎస్‌కేబీఆర్ కాలేజీలో ఇంటర్ చేశారు. పాలిటెక్నిక్ సీప్ లో ర్యాంకు వస్తే.. కాకినాడలో ఆంధ్రపాలిటెక్నిక్ కాలేజీలో చేరి.. 1996లో పూర్తి చేశాను. కాకినాడలో ఇంటర్న్‌షిప్ తర్వాత హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యి. జే జే అండ్ అసోసియేట్స్ వద్ద చేరాను. ఆయనే నా ఆది గురువు. ఆయనతోపాటు అక్కడి సీనియర్స్ వల్ల ఎంతో పని నేర్చుకున్నాను. తర్వాత జేఎన్‌టీయు నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్స్ కూడా చేశాను. అలాగే మాస్టర్స్ ఇన్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కూడా పూర్తి చేశాను. తర్వాత కొన్ని పేరెన్నిక గల పలు సంస్థల్లో ఇరవై సంవత్సరాలు కష్టపడి పని చేశాను. ఆర్కిటెక్ట్ కూడా నిర్మాణ నిర్వహణ గురించి అవగాహన తప్పకుండా ఉండాలి.
అన్వితా ఇవానాను డిజైన్ చేసేటప్పుడు ఎంత సమయం పట్టిందనే విషయాన్ని లెక్కపెట్టలేదు. ఎందుకంటే, హైదరాబాద్‌లోనే ఒక బెస్ట్ ప్రాజెక్టును డిజైన్ చేయాలన్న ప్యాషన్ వల్ల అసలు టైమ్‌ను ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. కాకపోతే, ఆర్కిటెక్టుగా కొన్ని ప్యారామీటర్స్ అయితే పెట్టుకున్నాను. ముందుగా నేను చేసే డిజైన్ క్లయింట్‌కు నచ్చాలన్నదే మొదటి లక్ష్యం. కాస్ట్ ఎఫిషీయన్సీని చెక్ చేసుకోవాలి. ఆధునిక నిర్మాణ పద్ధతుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల బదులు ఆధునిక టెక్నాలజీ పశ్చిమ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. ఊహించిన దానికంటే అధిక వేగంగా ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతోంది. అందుకే, ఇవానా కోసం షియర్ వాల్ మరియు అల్యూమినియం ఫార్మ్ టెక్నాలజీని ఎంచుకున్నాం. ఇందులో భాగంగా పది రోజులకో అంతస్తు నిర్మాణం పూర్తవుతుంది. నిర్మాణం రంగంలో టైమ్ ఈజ్ మనీ కాబట్టి.. అన్నీ అంశాల్ని దృష్టిలోకి తీసుకుని ప్రాజెక్టును డిజైన్ చేశాం.
అన్వితా ఇవానా సైటును కళ్లారా చూస్తే.. స్ట్రాటజిక్ లొకేషన్ అనిపించింది. ఒకవైపు హండ్రెడ్ ఫీట్ సర్వీస్ రోడ్డు.. ఔటర్ రింగ్ రోడ్డు.. మరోవైపు విల్లాస్ ఉన్నాయి. ఎక్కడా హైరైజ్ బిల్డింగ్స్ లేవు. గాలీవెలుతురు ధారాళంగా ఫ్లాట్లలో ఉంటుందని అర్థమైంది. అందుకే, సెంట్రల్ కోర్టు యార్డును మూడు ఎకరాల్లో డెవలప్ చేశాం. దాని పక్కనే క్లబ్ హౌజ్ ఉంటుంది. వీటికి చుట్టూ నాలుగు టవర్లు ఉండేలా డిజైన్ చేశాం. ఇందులోని ప్రతి ఫ్లాట్‌కు కోర్ట్‌యార్డ్ వ్యూ లేదా ఓఆర్ఆర్ వ్యూ ఉంటుంది. లేకపోతే విల్లా మరియు హండ్రెడ్ ఫీట్ రోడ్డు వ్యూ ఉంటుంది. అంటే అన్ఇంటరప్టెడ్ వ్యూ ఉంటుందన్నమాట. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. ప్రతి ఫ్లాటులోకి గాలీ, వెలుతురు దారాళంగా వస్తుంది. నాలుగు టవర్లను కూడా స్ట్రెయిట్ లైన్‌లోకి తీసుకోవడం వల్ల ప్రతి ఫ్లాట్ కూడా ఒక కార్నర్ యూనిట్గా డివైడ్ అవుతుంది. ఇంటర్నల్ ఏరియా అంటే బెడ్‌రూంలో కానీ కిచెన్లో కానీ సహజసిద్ధమైన వెలుతురు ధారాళంగా వస్తుంది. పగటి వేళలో ఒక్క లైటు కూడా వేసుకోవాల్సిన అవసరమే రాదు. క్లబ్‌హౌజ్‌ను యాభై వేల చదరపు గజాల్లోనే డెవలప్ చేసినప్పటికీ, లక్షా అరవై వేల చదరపు అడుగుల్లో ఎమినిటీస్‌ను ప్రొవైడ్ చేశాం. ఇందులో ఆరు బ్యాడ్మింటన్ కోర్టులున్నాయి. స్వ్కాష్ కోర్టులు, మల్టీపర్పస్ కోర్టులు, 150 నుంచి 400 మందికి సరిపడేలా రెండు బ్యాంకెట్ హాల్స్, యోగా రూమ్, జిమ్మాజియం, మెడిటేషన్ హాల్స్, ఇండోర్ గేమ్స్, క్లబ్ హౌజ్ పైన గోల్ఫ్ బట్టింగ్ ఏరియా, క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్, రెండు స్విమ్మింగ్ పూల్స్, కేఫ్‌టీరియా వంటివన్నీ ప్రొవైడ్ చేశాం. ప్రతి టవర్ కింద పలు ఫెసిలిటీస్‌ను ప్రొవైడ్ చేశాం. పండగ సమయాల్లో అయినా మ్యూజికల్ ఈవెంట్స్ అయినా ఘనంగా జరుపుకోవడానికి మూడు ఎకరాల స్థలం చక్కగా సరిపోతుంది.
సాధారణంగా స్కై స్క్రేపర్లలో టాప్ ఫ్లోర్‌లోకి ఎవరినీ పెద్దగా అనుమతించరు. రూఫ్‌టాప్‌లోకి వెళితే సేఫ్ కాదన్న భయం కొందరిలో ఉంటుంది. ఇలాంటి భయాల్ని తొలగించడానికి రూఫ్‌టాప్ మొత్తాన్ని ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్ చేశాం. అన్నిరకాల సేఫ్టీ మెజర్స్ తీసుకుని.. రూఫ్‌టాప్ చుట్టూ మంచి మొక్కలకు స్థానం కల్పించాం. పర్గోలాలను డిజైన్ చేసి.. చిట్‌చాట్ చేసుకోవడానికి చిన్నచిన్న గజిబోస్‌ను మధ్యలో ఏర్పాటు చేశాం. పైన పర్గోలాస్, ట్రీస్ ఉండటం వల్ల ఎయిర్‌ఫ్లో ప్రెషర్ గణనీయంగా తగ్గుతుంది. సాయంత్రం వేళలో అక్కడ కూర్చునేవారూ చక్కగా ఆస్వాదిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
అచ్యుతరావుతో నాకు పరిచయం ఎలా జరిగిందంటే.. నేను పాత కంపెనీలో పని చేసేటప్పుడు తను మాకు క్లయింట్. అందులో భాగంగా ఆయనతో కలిసి చాలా క్లోజ్‌గా పని చేశాను. నేను బయటికొచ్చిన తర్వాత అచ్యుతరావును కలిశాను. ఆయన స్పెషాలిటీ ఏమిటంటే.. దుబాయ్, అమెరికా వంటి నగరాల్లో కొన్నేళ్ల పాటు కన్‌స్ట్రక్షన్స్ చేశారాయన. విదేశీ నిర్మాణ పోకడలు, అక్కడి క్వాలిటీ మీద ఫుల్ ఫోకస్ ఉంది. ఆయన అంతర్జాతీయ కన్‌స్ట్రక్షన్ ట్రెండ్స్‌ను హైదరాబాద్ వాసులకు అందించాలనే ఆలోచనలున్నవారు. ఆయన్ని కలవగానే.. మంచి ప్రోత్సాహాన్ని అందించారు. కొల్లూరులో పదమూడు ఎకరాల స్థలముంది. అందులో ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్టును చేయాలని ఉందన్నారు. బయ్యర్లకు ఏదో ఒక కొత్త ఫెసిలిటీని అందించాలనే ప్యాషన్‌తో ఉండేవారు. నిర్ణీత బడ్జెట్‌లోపు కొనుగోలుదారులకు అదనంగా ఎలాంటి సౌకర్యాల్ని అందించవచ్చనే విషయం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ప్రాజెక్టులో ఫలానా సౌకర్యం లేదా ఎమినిటీస్ పెడితే కొత్తగా ఉంటుందని ఎప్పుడు చెప్పినా అంగీకరించేవారు. ఎప్పుడు నో అని చెప్పేవారు కాదు. హైరైజ్ బిల్డింగ్‌లో.. టాప్ టూ ఫ్లోర్స్ డ్యూప్లే స్కైవిల్లాస్ గా డిజైన్ చేశాం, వాటికి క్లౌడ్ విల్లాస్ గా పేరు పెట్టాం. ఇవి సుమారు నలభై వరకూ ఉంటాయి. అంతేకాదు, క్లౌడ్ విల్లాస్‌పైన కొత్తగా టెర్రస్ గార్డెన్ ను డెవలప్ చేశాం. స్కైలాంజెస్‌ను ప్రవేశపెట్టాం. ఒక్కొక్కటి విభిన్నంగా కనిపించేలా తీర్చిదిద్దాం. ఆయనెప్పుడూ కొత్తదనం కోరుకునేవారు కాబట్టి.. ఏ కొత్త విషయం గురించి చెప్పినా.. ఆయన పూర్తిగా అర్థం చేసుకుని.. సరే అని పచ్చజెండా ఊపేవారు. మొత్తానికి, హైదరాబాద్‌లోని కొల్లూరులో అన్వితా ఇవానా వంటి బ్యూటీఫుల్ ప్రాజెక్టును డిజైన్ చేసినందుకు సంతోషంగా ఉంది.
This website uses cookies.