Categories: LEGAL

పృథ్వీరామ్ ఇన్ ఫ్రాపై సీబీఐ కేసు

హైదరాబాద్ కి చెందిన పృథ్వీరామ్ ఇన్ ఫ్రా సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రూ.8 కోట్ల రుణం ఎగవేతకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఉండవల్లి రాజగోపాల్, బొప్పుడి శేషగిరిరావులు భాగస్వాములుగా ఉన్న ఈ కంపెనీ 2016 అక్టోబర్ లో హైదరాబాద్ డిఫెన్స్ కాలనీలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రూ.4 కోట్ల ఓడీ, రూ.2 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుంది. ఇందుకోసం స్టాక్స్, సంస్థ ఆస్తులతోపాటు కంచన్ బాగ్ లో భవనం, గగన్ పహాడ్, రాజేంద్రనగర్ లలో స్థలాలను సెక్యూరిటీగా పెట్టింది.

అయితే, రుణం తీసుకున్న తర్వాత చెల్లింపులో విఫలమైంది. దీంతో ఆడిట్ దర్యాప్తు చేయగా.. నిధులన్నీ ఇతర కంపెనీలకు మళ్లించినట్టు గుర్తించారు. అయితే, అందుకు సంబంధించిన బిల్లులు, ఇతరత్రా డాక్యుమెంట్లు సమర్పించడంలో కంపెనీ విఫలమైంది. ఈ నేపథ్యంలో బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సదరు కంపెనీ వల్ల బ్యాంకుకు రూ.8.15 కోట్ల మేర నష్టం కలిగిందని బ్యాంకు పేర్కొంది.

This website uses cookies.