హైదరాబాద్ లో సొంతిళ్లలో నివసించే వరి కంటే అద్దె ఇంట్లో నివసించే వారి సంఖ్యే ఎక్కువ. చిరు ఉద్యోగులు, సామాన్యుల నుంచి మొదలు దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లు చాలా వరకు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు, ఎవరి ఆదాయ వనరులును బట్టి, కుటుంబ అవసరాలను బట్టి ఇంటి అద్దె చెల్లిస్తున్నారు హైదరాబాద్ వాసులు. అయితే ఇంటి యజమానికి హక్కులు ఉన్నట్లే అద్దెకు ఉంటున్న వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలే కాకుండా, అదనపు షరతులు కూడా వర్తిస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
అద్దెకు ఉండే వారి ప్రయోజనాలను కాపాడేందుకు గాను చట్టంలో కొన్ని నెలులుబాటులు కల్పించారు. ఇంచు మించు యజమానితో సమానంగా ఇంట్లో అద్దెకు ఉండేవారికి సైతం కొన్ని హక్కులను కల్పించింది చట్టం. అందులో ప్రధానమైంది స్పేఛ్చగా నివసించే హక్కు.
ఇల్లు అద్దెకు ఇచ్చిన తర్వాత సదరు ఇల్లు అద్దెకు తీసుకున్న వారి నివాసంగా మారుతుంది. కాబట్టి రెంట్ తీసుకున్న వారి గోప్యత విషయంలో ఇంటి యజమాని జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అద్దెకు ఉంటున్న వారి రోజువారీ కార్యకలాలపై పరిమితులు వధించే హక్కు ఇంటి యజమానికి ఉండదు.
ఇంటి యజమాని అన్న పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు.. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడానికి కుదరదు. ఇంట్లోకి వచ్చే ముందు కచ్చితంగా అద్దెదారు అనుమతి తీసుకోవాల్సిందేనని 1948 అద్దె నియంత్రణ చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి.
ఎప్పుడుపడితే అప్పుడు అద్దెకున్న వారిని ఇంట్లోనుంచి పంపించడానికి కూడా నిబంధనలు ఏ మాత్రం ఒప్పుకోవు. ఇల్లు ఖాళీ చేయడానికి అద్దెదారుడికి కనీసం 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. ఇక ఒకవేళ రెంటుకు ఉన్న వ్యక్తి రెండు నెలలకు మించి అద్దె చెల్లించకపోయినట్లే యజమాని మిమ్మల్ని ఇంటిని ఖాళీ చేయించే అధికారం ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
ఇంటి యజమాని ఇష్టానుసారంగా అద్దెను పెంచే హక్కు కూడా ఉండదు. మార్కెట్ ధరను బట్టే అద్దెను నిర్ణయించాలి. అద్దె పెంచే ముందు యజమాని అద్దెదారుడికి మూడు నెలల ముందే విషయాన్ని వెల్లడించాలి. 1948 అద్దె నియంత్రణ చట్టంలో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం అద్దెకు తీసుకునే ముందు లిఖితపూర్వక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.
ఇంటి మరమ్మత్తులు, నిర్వహణ ఖర్చుతో పాటు ఇంటి పన్నులను పూర్తిగా ఇంటి యజమాని స్వయంగా భరించాల్సి ఉంటుంది. అలాగే ఇంటిని అద్దెకు తీసుకునే ముందు ఇచ్చిన సెక్యూరిటీ పాజిట్ను ఇల్లు ఖాళీ చేసే సమయంలో తిరిగి చెల్లించాలని అద్దె నియంత్రణ చట్టం చెబుతోంది.
This website uses cookies.