ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా బెయిల్ నిరాకరించింది. సౌత్ గ్రూపులోని కీలక వ్యక్తులుగా భావిస్తున్న వారికి.. సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి అంగీకరించలేదు. మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా నాగపాల్ తుది నిర్ణయం ప్రకటించారు. అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయి బాబు, విజయ్ నాయర్‌ల బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్ట్ తోసిపుచ్చింది. తాజాగా సౌత్ గ్రూప్ నుంచి మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేస్తే.. గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తునట్టు ఈడీ వివరించింది. ఈ ఇద్దరు వెల్లడించే వివరాల ప్రకారం.. మరెంత మందిని అరెస్టు చేస్తారో?
సౌత్ గ్రూప్ నిందితులకు బెయిల్ వస్తే ఇతర సాక్షులను కేసు దర్యాప్తును కేసు ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది. ఈడీ విజ్ఞప్తి మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో అనేకమంది సాక్షులను వీళ్ళు ప్రభావితం చేసినట్టుగా కూడా కోర్టు దృష్టికి ఈడీ తీసుకురావడం జరిగింది. అయితే అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రా రెడ్డి, విజయ్, బినోయి బాబు నిందితులుగా తీహార్ జైలులో ఉన్నారు. ఈమధ్య అరబిందో రియాల్టీ ఎండీ రెండు వారాలు బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.
This website uses cookies.