Categories: TOP STORIES

ప్రపంచంలో ప్రప్రథమం క్రిప్టో కరెన్సీ.. స్మార్ట్ సిటీ!

  • 800 ఎక‌రాల్లో స‌తోషి ఐలాండ్‌
  • పౌర‌స‌త్వం తీసుకుంటేనే ప్ర‌వేశం
  • క్రిప్టో క‌రెన్సీ నిపుణులు, ఔత్సాహికుల‌కే
  • ఇక్క‌డి లావాదేవీల‌న్నీ క్రిప్టో క‌రెన్సీలోనే!
  • నివాసంతో పాటు ఆఫీసుల‌ ఏర్పాటు

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: ప్రపంచంలోనే ప్రప్రథమంగా క్రిప్టో కరెన్సీ ఆధారిత స్మార్ట్ సిటీ ఆరంభ‌మైంది. ఆస్ట్రేలియా, ఫిజి దేశం మధ్యలోని వనాటూకు చెందిన ఓ ద్వీపకల్పంలో ఈ క్రిప్టో ప్యారడైజ్ ని డెవలప్ చేస్తున్నారు. స‌తోషి ఐలాండ్ అని నామ‌క‌ర‌ణం చేసిన ఈ ద్వీప‌క‌ల్పాన్ని పూర్తిగా బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు ఎనిమిది వంద‌ల ఎక‌రాల్లో 32 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రైవేటు ద్వీప‌క‌ల్పంలోని కేవ‌లం 21000 మందికే పౌర‌స‌త్వాన్ని ఇస్తారు.

స‌ముద్రం మధ్య‌లో ఎగిసే అల‌ల్ని చూసుకుంటూ.. ఎంచ‌క్కా అక్క‌డ్నుంచి ఆఫీసు ప‌ని చేసుకోవ‌చ్చు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాసం ఉండొచ్చు. స‌తోషి ఐల్యాండు మొదటి దశలో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంప్రదాయ విల్లాల స్థాయిలో ఉండే ఈ ప్రాంతాన్ని చెకిన్ ఏరియాగా వినియోగిస్తారు. అక్కడే సేద తీరొచ్చు.

ప్రపంచంలోనే ప్రప్రథమ క్రిప్టో రాజధానికి చేరుకునేందుకు ఆస్ట్రేలియా, ఆసియా, కెనడా, యూఎస్ నుంచి నేరుగా విమానాలున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల క్రిప్టో నిపుణులు, ఔత్సాహికుల కోసమే ప్రత్యేకంగా క్రిప్టో స్మార్ట్ సిటీని డిజైన్ చేశారు. సస్టెయినబుల్ డిజైన్, ఆధునిక ఆర్కిటెక్చర్ కు చిరునామాగా నిలిచే ఈ సతోషీ ఐల్యాండ్ ను ప్రపంచ పేరెన్నిక ఆర్కిటెక్ట్.. హాంకాంగ్‌కు చెందిన సైబర్ టెక్చర్ సీఈవో జేమ్స్ లా డిజైన్ చేశారు. ఇందులో నివాస, ఆఫీసు సముదాయాలతో పాటు ఎంటర్ టైన్‌మెంట్ జోన్లుంటాయి. ఇందులోకి అడుగుపెట్టాలంటే ముందుగా ఆ సిటీ పౌర‌స‌త్వం తీసుకోవాలి. ఇందుకోసం అక్క‌డ స్థ‌లం కొనాల్సి ఉంటుంది.

భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీ ఆధారిత నిర్మాణాల్ని చేపడతారు. ఈ కాన్సెప్టుకు సతోషి ఐలండ్ మాడ్యుల్ అని పేరు పెట్టారు. ఎనిమిది వందల రకాల విభిన్నమైన గృహాలు, అపార్టుమెంట్లను నిర్మిస్తారు. ఆధునిక ఎమినిటీస్ కు రూపకల్పన చేస్తారు. ఇప్పటికే హాంకాంగ్ వంటి దేశంలో ఆధునిక గృహాల్ని నిర్మించిన అనుభవంతో సతోషి ఐల్యాండ్ ను భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని సైబర్ టెక్చర్ సీఈవో జేమ్స్ లా తెలిపారు. ఫ్యూచరిస్టిక్ మాడ్యులార్ డెవలప్మెంట్ మరియు సస్టెయినబిలిటీ సూత్రాల ఆధారంగా ఆధునిక గృహాల్ని సైబర్ టెక్చర్ డెవలప్ చేస్తుంది. ముందుగా స్థ‌లం కొంటేనే స‌తోషి ఐల్యాండ్ లోకి అడుగుపెట్టేందుకు వీసా ల‌భిస్తుంది.
సతోషి ద్వీపం పౌరులకు ద్వీపంలో శాశ్వతంగా నివసించడానికి మరియు పని చేయడానికి హక్కు ఉంది. మీ సొంత‌ ప్రాజెక్ట్‌లో పని చేయండి మరియు కో-వర్కింగ్ స్పేస్‌ని సద్వినియోగం చేసుకోండి లేదా ద్వీపంలో బేస్ ఉన్న ప్రాజెక్ట్‌లలో ఒకదాని కోసం పని చేయండి. పౌరసత్వం హోల్డర్‌కు దీర్ఘకాలిక వసతిని కూడా అందిస్తుంది, స్వల్పకాలిక సందర్శకులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉండదు. పౌరసత్వ ఎన్ఎఫ్‌టీని కలిగి ఉండటం వలన వ్యాపారాల యజమానులు ద్వీపంలో క్రిప్టో ప్రాజెక్ట్‌లు లేదా ఈవెంట్‌లను స్థాపించ‌డానికి అనుమ‌తి ఉంటుంది. అలా చేయడానికి అవసరమైన అదనపు లైసెన్స్ ఆధారిత ఎన్ఎఫ్టీలు పౌరసత్వ హోదా కలిగిన వారికి మాత్రమే మంజూరు చేస్తారు.

This website uses cookies.