Categories: LEGAL

అద్దె గ్యారెంటీ ఎలా ఇస్తారు?

  • మీ క‌ష్టార్జితం జాగ్ర‌త్త‌!

సైబ‌రాబాద్ ప‌రిధిలో దాదాపు వంద‌కు పైగా కంపెనీలు వాణిజ్య స‌ముదాయాల్లో స్థ‌లాన్ని విక్ర‌యిస్తున్నాయి. ప‌ది ల‌క్ష‌లు పెడితే చాలు అద్దె గ్యారెంటీగా ఇస్తామంటూ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల్ని గుడ్డిగా నమ్మేయకుండా.. నాలుగైదు సార్లు క్షుణ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.

జయా గ్రూపు అనే సంస్థ పశ్చిమ హైదరాబాద్లోని గోపనపల్లిలో 4.2 ఎకరాల్లో వెస్టర్న్ గెలాక్సీ అనే వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోందట. జి ప్లస్ 9 అంతస్తుల ఎత్తులో 96 వేల చదరపు అడుగుల్లో మొత్తం నిర్మాణం వస్తుందట. ఇందులో పది లక్షల్ని పెట్టి ఎవరైనా 200 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేస్తే.. నిర్మాణం పూర్తయ్యేవరకూ చదరపు అడుక్కీ రూ.50 చొప్పున అద్దె అందజేస్తుందట. నిర్మాణం పూర్తయ్యాక చదరపు అడుక్కీ రూ.100 అద్దె ప్రతినెలా ఇస్తుందట.

అసలే కరోనా కారణంగా హైదరాబాద్లో 30 కోట్ల చదరపు అడుగుల ఐటీ, వాణిజ్య సముదాయాలకు గిరాకీ లేదు. ఈ నేపథ్యంలో, ఇలాంటి ప్రాజెక్టుల్ని కట్టేదెప్పుడు? పూర్తయ్యేదెప్పుడు? అందులో సంస్థలు ఎప్పుడొస్తాయి? అప్పటివరకూ అద్దెలు ఎవరిస్తారు? ఇవన్నీ అయ్యే పనేనా? కాబట్టి, కొనుగోలుదారులు ఇలాంటి సంస్థల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని విషయాల్ని కూలంకషంగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయండి. మీ కష్టార్జితానికి మీరే బాధ్యులని గుర్తుంచుకోవాలి.

This website uses cookies.