Categories: LATEST UPDATES

భూ రికార్డుల నమోదుకు డిజిటల్ వ్యాలెట్

  • కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

కర్ణాటకలోని భూముల వివరాలను కంప్యూటరీకరణ చేసే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీ యజమానుల ఇబ్బందులకు చెక్ చెప్పడం కోసం త్వరలోనే డిజిటల్ వ్యాలెట్ ప్రారంభించబోతోంది. సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ (సీఎస్జీ) ఈ ప్రాజెక్టు చేపట్టింది. కావేరి బ్లాక్ చెయిన్ పేరుతో చేపట్టిన ఈ వ్యాలెట్ లో రాష్ట్రంలోని సమగ్ర భూ వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ ఆస్తుల నుంచి వ్యవసాయ భూముల వరకు, వాణిజ్య, నివాస గృహాలు.. ఇలా అన్ని ఆస్తుల వివరాలనూ యజమానుల పేర్లతో సహా నమోదు చేయనున్నారు.

అనంతరం దానికి సంబంధించిన స్మార్ట్ కార్డు వారికి ఇస్తారు. అనంతరం ఆ కార్డును స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సదరు యజమాని ఆధార్ నంబర్ లింక్ చేసి ధ్రువీకరిస్తారు. ఒకసారి ఆధార్ నంబర్ పరిశీలన పూర్తయితే కావేరి పోర్టల్ లో ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు నిక్షిప్తమై లాక్ అవుతాయి. వాటిని సదరు యజమానులు ఏ సమయంలోనైనా నాలుగు అంకెల పాస్ వర్డ్ ఉపయోగించి చూసుకోవచ్చు. మొత్తం 67 రకాల లావాదేవీలను ఇందులో రికార్డు చేస్తారు. ఇప్పటికే తుమకూరు జిల్లాలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.

This website uses cookies.