Good news from the government: free sand for house construction
ఈ నెల నుంచి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఎంపిక చేయనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రంలో అందించే 4.50 లక్షల ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 సంవత్సరంలో మొత్తం 112 క్యూబిక్ మీటర్లు ఇసుకను లబ్ధిదారులకు అందించనున్నారు.
లబ్ధిదారులకు ఎలాంటి సీనరేజీ ఛార్జీలు, రవాణా భారం పడకుండా అధికారులు ఇసుకను అందించనున్నారు. ఈ మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులను జారీ చేసింది. నాలుగు త్రైమాసికాల వారీగా జిల్లాలకు ఎంత ఇసుక అవసరమో మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఏ ప్రాతం నుంచి ఇసుకను సరఫరా చేయాలో వివరించారు.
ALSO READ: మధ్యతరగతికి అందనంత దూరాన సొంతిల్లు..
గతేడాదికి సంబంధించి నాలుగో త్రైమాసికానికి సంబంధించి 25 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. అలాగే 2025-26లో మొదటి 3 త్రైమాసికాల్లో 25 లక్షల టన్నులు చొప్పున, నాలుగో త్రైమాసికంలో 12 వేల టన్నులు చొప్పున ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేస్తారు. హైదరాబాద్లో 13.06 లక్షల టన్నుల ఇసుక అవసరమని ప్రభుత్వ గుర్తించగా, ఈ ఇసుకను మహబూబ్‌నగర్, నల్గొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి సరఫరా చేస్తారు. మిగతా జిల్లాల్లో ఆయా ప్రాంత వనరుల నుంచి ఇసుకను అందిస్తారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు చొప్పున ఇసుకను సరఫరా చేయనున్నారు.
This website uses cookies.