Categories: PROJECT ANALYSIS

బాచుప‌ల్లిలో గ్రీన్ గేటెడ్ క‌మ్యూనిటీ ఆర్క్ స‌మ్య‌క్‌

బాచుప‌ల్లిలో గ్రీన్ గేటెడ్ క‌మ్యూనిటీ ఆరంభ‌మైంది. ఐజీబీసీ గోల్డ్ రేటింగును అందుకున్న ఈ నిర్మాణంలో నివ‌సించేవారు.. స్వ‌చ్ఛ‌మైన గాలీ, వెలుతురును ఇంట్లోకి ప్ర‌వేశించ‌డాన్ని ఆస్వాదించొచ్చు. విద్యుత్తు ఖ‌ర్చు ఆదా అవుతుంది. క‌మ్యూనిటీలో ప‌చ్చ‌ద‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. సిల్వ‌ర్ ఓక్స్ స్కూల్ ప‌క్క‌నే సుమారు 1.9 ఎక‌రాల్లో నిర్మిత‌మ‌వుతున్న ఆర్క్ స‌మ్య‌క్ ప్రాజెక్టులో వ‌చ్చేవి కేవ‌లం 160 ఫ్లాట్లే. పైగా, 1270 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్ ధ‌ర‌.. కేవ‌లం రూ.69.85 ల‌క్ష‌ల నుంచి ఆరంభ‌మ‌ని ఆర్క్ హోమ్స్ సంస్థ చెబుతోంది.

* బాచుప‌ల్లిలో చాలామంది బిల్డ‌ర్లు గేటెడ్ క‌మ్యూనిటీల‌ను నిర్మిస్తున్నారు. కాక‌పోతే, కొనుగోలుదారుల అభిరుచి మేర‌కు నిర్మించే వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ, ఆర్క్ హోమ్స్ ఇందుకు పూర్తిగా భిన్న‌మ‌ని చెప్పొచ్చు. బ‌య్య‌ర్ల‌కు ద బెస్ట్ క‌మ్యూనిటీని అందించాల‌నే ఎప్పుడూ ఆలోచిస్తుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌ప్ర‌థ‌మంగా కిడ్స్ ఫ్రెండ్లీ అపార్టుమెంట్‌కు బాచుప‌ల్లిలో శ్రీకారం చుట్టింది. ఇందులో 2, 2.5, 3 బెడ్రూమ్ ఫ్లాట్ల‌కు శ్రీకారం చుట్టింది. రేటు కూడా చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5,500గా నిర్ణ‌యించింది.

This website uses cookies.