poulomi avante poulomi avante

హైద‌రాబాద్ హాట్ లొకేష‌న్స్‌

ఈ మ‌ధ్య కొంత‌మంది డెవ‌ల‌ప‌ర్ల ప్ర‌క‌ట‌న‌ల్ని చూస్తే విచిత్రమేస్తోంది. ప్రాజెక్టు ఎక్క‌డో శంక‌ర్‌ప‌ల్లిలో ఉంటుంది. కానీ, కోకాపేట్‌కు ద‌గ్గ‌ర‌గా ఉందంటూ ప్ర‌చారం చేస్తారు. నిర్మాణం ప‌టాన్‌చెరులో ఉంటుంది. కానీ, గ‌చ్చిబౌలికి స‌మీపంలో ఉంద‌ని ఊద‌ర‌గొట్టేస్తారు. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మేసి.. ఫ్లాట్ల‌ను కొన‌కూడ‌దంటే.. అస‌లు గ‌చ్చిబౌలికి చుట్టుప‌క్క‌ల గ‌ల ప్రాంతాల గురించి ప్ర‌తిఒక్క‌రూ తెలుసుకోవాలి. అప్పుడే, ఫ్లాట్ల ఎంపిక ఎంతో సులువుగా ఉంటుంది.

గ‌చ్చిబౌలి.. ఎప్ప‌టికైనా హాట్ లొకేష‌నే. కాక‌పోతే, ఈ ప్రాంతంలో ఉన్న గేటెడ్ క‌మ్యూనిటీలు, ఆకాశ‌హ‌ర్మ్యాల‌ను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే, బిజినెస్ పార్కులు, టెక్నాల‌జీ కంపెనీల కార్యాల‌యాలే ఎక్కువున్నాయి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థ‌లున్నాయి. లాంజ్ బార్లు, జాతీయ మ‌రియు అంత‌ర్జాతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. గ‌చ్చిబౌలి స్టేడియం కూడా ఇక్క‌డే ఉంది. ఈ ప్రాంతానికి చుట్టుప‌క్క‌ల గ‌ల నాన‌క్‌రాంగూడ‌, మ‌ణికొండ‌, కోకాపేట్‌, నార్సింగి, గోప‌న‌ప‌ల్లి, తెల్లాపూర్‌, కొండాపూర్‌, మాదాపూర్, కేపీహెచ్‌బీ కాల‌నీ, మియాపూర్‌, వంటివి హాట్ లొకేష‌న్లు అని చెప్పొచ్చు.

ఇవే కీల‌క ప్రాంతాలు

హైద‌రాబాద్‌లో టాప్ లొకేష‌న్లుగా పేరు సంపాదించిన‌ ఈ ప్రాంతాల్లోనే.. ప్ర‌స్తుతం బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఆకాశ‌హ‌ర్మ్యాల నిర్మాణం జోరుగా జ‌రుగుతోంది. న‌గ‌రానికి చెందిన రియ‌ల్ సంస్థ‌ల‌తో పాటు ఇత‌ర న‌గ‌రాల‌కు చెందిన అనేక కంపెనీలు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ‌గా నిర్మాణాల్ని చేప‌డుతున్నాయి. ఇక్క‌డ్నుంచి మాదాపూర్‌, గ‌చ్చిబౌలి, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుల‌కు సులువుగా రాక‌పోక‌ల్ని సాగించొచ్చు. పైగా, అద్దెలూ బాగానే గిట్టుబాట‌వుతాయి. మార్కెట్ ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా.. హైద‌రాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో అధిక శాతం మంది.. ఈ ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. పెట్టుబ‌డిదారులూ ఇక్క‌డి ప్రాజెక్టుల్లోనే ఎక్కువ‌గా పెడ‌తారు.

* మై హోమ్‌, అప‌ర్ణా, రాజ‌పుష్ప‌, ప్రెస్టీజ్‌, రాంకీ, జ‌య‌భేరి, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్‌, శ్రీ ఆదిత్యా హోమ్స్‌, డీఎస్సార్‌, శ్రీ శ్రీనివాసా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌, వంశీరామ్‌, వాస‌వి, అశోకా, కాన్సెప్ట్ యాంబియెన్స్‌, సైబ‌ర్ సిటీ, అలేఖ్య హోమ్స్‌, వ‌ర్టెక్స్ హోమ్స్‌, అర‌బిందో, ఇండిస్, ముప్పా ప్రాజెక్ట్స్‌ వంటి సంస్థ‌లు త‌మ ప్రాజెక్టుల్ని ఇక్క‌డే చేప‌డుతున్నాయి. కాక‌పోతే ఒక్కో ప్రాజెక్టుది ఒక్కో ప్ర‌త్యేక‌త‌. కొన్ని ఇర‌వై అంత‌స్తుల్లోపు నిర్మిస్తుంటే.. మ‌రికొన్ని ఆకాశ‌హ‌ర్మ్యాల్ని క‌డుతున్నాయి. న‌గ‌రంలో నిర్మిత‌మ‌య్యే ప్రాజెక్టుల్లో ఈ సంస్థ‌ల‌దే సింహ‌భాగమ‌ని చెప్పొచ్చు. వీటితో పాటు ప‌లు రియాల్టీ కంపెనీలు చిన్నాచిత‌కా అపార్టుమెంట్ల‌ను క‌డుతున్నాయి.

ఫ్లాట్ల ధరలివే!

మాదాపూర్, కొండాపూర్, నాన‌క్‌రాంగూడ‌, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు చదరపు అడుక్కీ రూ.8000 నుంచి రూ.12,000 దాకా ఉన్నాయి. మణికొండ, నార్సింగి, గోపనపల్లి, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో రూ. 6000 నుంచి 8000 చెబుతున్నారు. మియాపూర్ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో చదరపు అడుక్కీ రూ.7,000 చొప్పున డెవలపర్లు విక్రయిస్తున్నారు. అదే స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లలో వీటి కంటే రేటు కాస్త తక్కువే ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలు, స్టాండ్ ఎలోన్ మధ్య ఫ్లాట్ల ధరలు చదరపు అడుక్కీ రూ.1000 నుంచి రూ.1500 దాకా తేడా ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles