దేశంలో స్థిరాస్తి ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే చెప్పక్కర్లేదు. తాజాగా డీఎల్ఎఫ్ సంస్థ ముంబైలో మొదటి ప్రాజెక్టును చేపట్టింది. ట్రైడెంట్ గ్రూప్ తో కలిసి స్లమ్ రీహాబిలిటేషన్ అథార్టీ ప్రాజెక్టు మొదటి దశలో ఒక మిలియన్ చదరపు అడుగులను అభివృద్ధి చేస్తోంది. అంధేరి ప్రాంతంలోని తన మొదటి లాంచ్ తో ముంబై రియల్ రంగంలోకి అడుగు పెట్టిన డీఎల్ఎఫ్.. ఆ ప్రాజెక్టులోని అపార్ట్ మెంట్ల ధరలను రూ.5.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల వరకు నిర్ణయించే అవకాశం ఉందని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. త్రీ బీహెచ్ కే అంత కంటే ఎక్కువ పరిమాణం కలిగిన అపార్ట్ మెంట్లే ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి పరిమాణాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ముంబైలో త్రీ బీహెచ్ కే అపార్ట్ మెంట్లు వెయ్యి చదరపు అడుగుల నుంచి 1500 చదరపు అడుగుల మధ్యలో ఉంటాయి.
This website uses cookies.