హైదరాబాద్ రియల్ రంగంలో కొందరు బిల్డర్లకు టీఎస్ రెరా అంటే ఏమాత్రం భయం లేకుండా పోయింది. అందుకే విచ్చలవిడిగా ప్రీలాంచుల్లో ఫ్లాట్లు, విల్లాల్ని విక్రయిస్తున్నారు. ఈ సంస్థలకు ప్రభుత్వంలో కొందరు పెద్ద తలకాయల అండదండలు ఉంటడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే, పలువురు బిల్డర్లు టీఎస్ రెరా ఛైర్మన్ అంటే పెద్ద భయం లేకుండా పోయింది. బెంగళూరుకు చెందిన ఒక నిర్మాణ సంస్థ ఏం చేస్తుందంటే.. ఛానెల్ పార్ట్‌నర్లతో ప్రీలాంచ్ వ్యాపారాన్ని సజావుగా కొనసాగిస్తుంది. కొనుగోలుదారులు ఇచ్చే అడ్వాన్స్ పేమెంట్ చెక్కుల్ని ఆయా ఛానెల్ పార్ట్‌నర్లు తమ వద్ద అట్టి పెట్టుకుంటున్నారు. రెరా నెంబర్ వచ్చాకే ఆయా చెక్కుల్ని తీసుకుంటామని ఆయా ఛానెల్ పార్ట్‌నర్లకు బెంగళూరు సంస్థ చెప్పడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
This website uses cookies.