Categories: TOP STORIES

రూ.60 ల‌క్ష‌ల్లోపు ఫ్లాట్లు ఇవే!

హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో ఫ్లాట్లను కొనాలంటే ఎక్కువ సొమ్ముంటేనే సాధ్య‌మ‌వుతుంది. మ‌రి ఖ‌రీదైన ఫ్లాట్లు కాకుండా.. నివాస‌యోగ్య‌మైన‌వి.. ఓ యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల్లోపు ఫ్లాట్లు ఎక్క‌డ దొరుకుత‌న్నాయో తెలుసా?

హైద‌రాబాద్‌లోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంప‌స్ చేరువ‌లో యాభై ఐదు ల‌క్ష‌ల‌కే ఒక బ‌డా ప్రాజెక్టులో ఫ్లాట్లు ల‌భిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు 2025లో పూర్త‌వుతుంది. బాచుప‌ల్లిలో వాస‌వి సంస్థ వాస‌వి అర్బ‌న్ అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందులోనూ ఇదే బ‌డ్జెట్‌లో మీకు న‌చ్చిన ఫ్లాట్ ల‌భిస్తుంది. కొంప‌ల్లి చేరువ‌లోని బొల్లారం రోడ్డులోనూ మీకు అర‌వై ల‌క్ష‌ల్లోపు ఫ్లాట్లు దొరుకుతాయి. ప్ర‌గ‌తి న‌గ‌ర్లోని మిథులాన‌గ‌ర్‌లోనూ ఒక చిన్న సైజు బిల్డ‌ర్ అర‌వై ల‌క్ష‌ల్లోపే ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్నాడు. కాక‌పోతే, ఇది స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ అని గమ‌నించాలి. గండిమైస‌మ్మ వ‌ద్ద ఓ సంస్థ నిర్మిస్తున్న గేటెడ్ క‌మ్యూనిటీలో అర‌వై ల‌క్ష‌ల్లోపే ఫ్లాట్లు దొరుకుతున్నాయి. బాచుప‌ల్లి త‌ర్వాత వ‌చ్చే బౌరంపేట్‌లోనూ ఈ ధ‌ర‌కే ఓ సంస్థ అపార్టుమెంట్‌ను అంద‌జేస్తోంది.

న‌గ‌రంలోని బ‌హ‌దూర్‌ప‌ల్లి, కొంప‌ల్లి, కొల్లూరు, ప‌టాన్ చెరు, ఇస్నాపూర్‌, వెలిమ‌ల, మదీనాగూడ త‌ర్వాత వ‌చ్చే పీజేఆర్ న‌గ‌ర్, అమీన్‌పూర్‌, వంటి ప్రాంతాల్లోనూ స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ల‌లో అర‌వై ల‌క్ష‌ల్లోపే ఫ్లాట్లు ల‌భిస్తున్నాయి. విజ‌య‌వాడ హై మీద గ‌ల హ‌య‌త్‌న‌గ‌ర్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనూ మీకు ఇదే బ‌డ్జెట్‌లో స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్‌లో ఫ్లాట్లు ల‌భిస్తాయ‌ని గుర్తుంచుకోండి. కాక‌పోతే మీరు ఫ్లాట్ కొనుగోలు చేసేట‌ప్పుడు ఆయా అపార్టుమెంట్‌కు జీహెచ్ఎంసీ కానీ స్థానిక కార్పొరేష‌న్ లేదా స్థానిక మున్సిపాలిటీ నుంచి అనుమ‌తి ఉంటేనే అడుగు ముందుకేయండి. రెరా అనుమ‌తి కూడా ఉన్న అపార్టుమెంట్ల‌ను కొనుగోలు చేయండి. ఎందుకంటే, మీరు ఫ్లాట్ కొన్న త‌ర్వాత ఐదేళ్ల వ‌ర‌కూ స్ట్ర‌క్చ‌ర్‌లో ఎలాంటి లోపాలున్నా వాటికి మ‌ర‌మ్మ‌త్తులు చేయించాల్సిన బాధ్య‌త బిల్డ‌ర్ మీదే ఉంటుంది.

This website uses cookies.