Categories: EXCLUSIVE INTERVIEWS

న‌వంబ‌రులో ప్రెస్టీజ్ సిటీ ఆరంభం

  • రియ‌ల్ ఎస్టేట్ గురుతో
    ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మ‌న్ ఇర్ఫాన్ ర‌జాక్‌

హైద‌రాబాద్‌లోని బుద్వేల్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజ్ లెట‌ర్ వ‌చ్చింద‌ని.. అనుమ‌తుల‌న్నీ రాగానే వ‌చ్చే నెల ప్రెస్టీజ్ సిటీని ఆరంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఛైర్మ‌న్ ఇర్ఫాన్ ర‌జాక్‌ తెలిపారు. ఈజిప్టులోని ష‌ర్మ్ ఎల్ షేక్‌లోని క్రెడాయ్ న్యాట్‌కాన్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే కొన్ని ప్రాజెక్టుల్ని చేప‌డుతున్నామ‌ని.. ప‌లు కొత్త నిర్మాణాల్ని ఆరంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. సీనియ‌ర్ సిటిజ‌న్ హౌసింగ్‌ను చేప‌ట్టాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని తెలిపారు. నిర్మాణ రంగంలో అమ్మ‌కాల విష‌యానికి వ‌స్తే ప్రాడ‌క్టే ముఖ్య భూమిక పోషిస్తుంద‌న్నారు. మార్కెట్ డిమాండ్‌కు త‌గ్గ‌ట్టుగా ఫ్లాట్లు ఉన్న‌ప్పుడే వాటికి ఆటోమెటిగ్గా గిరాకీ ఉంటుంద‌న్నారు. బెంగ‌ళూరులో కొన్ని లేఅవుట్ల‌ను సైతం అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

నొయిడాలోని సెక్టార్ 150లో చాలా కాలం నుంచి అనుమ‌తి కోసం మా ప్రాజెక్టు నిలిచిపోయింది. స్పోర్ట్స్ సిటీ స‌మ‌స్య ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని తెలిసింది. ఎయిరో సిటీ విషయానికొస్తే అది పూర్తిగా క్యాపెక్స్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. హాస్పిటాలిటీ, షాపింగ్ మాల్స్ వంటివి నిర్మించ‌డానికే క్యాపెక్స్ అవస‌రం అవుతుంది. అంతేత‌ప్ప‌, నివాస గృహాల్ని నిర్మించ‌డానికి పెద్ద‌గా అక్క‌ర్లేదు. ఇప్ప‌టికే మూడు మాళ్ల‌ను నిర్మించాం. ఫోరం మాళ్ల‌ను హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నైలో విస్త‌రిస్తాం. ఈ మూడు క‌లిపి సుమారు రెండు మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల్లో డెవ‌ల‌ప్ చేస్తున్నాం. వీటిని నిర్మించ‌డానికి మా వ‌ద్ద మెరుగైన నిపుణుల బృందం ఉంది. అంతేకాదు, కాంట్రాక్ట‌ర్ల‌తో కూడా ప‌ని చేస్తాం. షాపింగ్ మాళ్ల‌కు గిరాకీ ఉన్నందు వ‌ల్లే మూడు న‌గ‌రాల్లో నిర్మించేందుకు ప్లాన్ చేశాం.
కొచ్చిలో ఆరంభించిన కొత్త మాల్‌కు మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఢిల్లీలో జాయింట్ డెవ‌ల‌ప్‌మెంట్ మీద కేజీ మాల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. గోవాలో ప్రెస్టీజ్ ఓషీయ‌న్ ట‌వ‌ర్స్ అనే విల్లా ప్రాజెక్టును పూర్తి చేశాం. కొత్త ప్రాజెక్టుల నిమిత్తం హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, ముంబై వంటి ప్రాంతాల వైపు చూస్తున్నాం. గోవా టూరిస్ట్ డెస్టినేష‌న్ కావ‌డంతో అక్క‌డ విల్లాల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నాం. అక్క‌డ మారియ‌ట్ రెసిడెన్సీని నిర్మించాం. మేమే మేనేజ్ చేస్తున్నాం. బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై వంటి న‌గ‌రాల్లో.. అఫ‌ర్డబుల్‌, మిడ్ సెగ్మంట్ గృహాల‌కే అధిక గిరాకీ ఉంటుంది. ముంబైలో అయితే రూ.30 కోట్ల విలువైన ఇళ్ల‌కు ఆద‌ర‌ణ ఎక్కువే. ఢిల్లీలోని ఎయిరోసిటీలో రెండు బ‌డా హోట‌ళ్ల‌ను నిర్మిస్తున్నాం. ఇవి 2025-26లోపు పూర్త‌వుతాయి. ఇండియాలోనే ఇది అతిపెద్ద హోట‌ల్‌గా నిలుస్తుంది.
నిర్మాణ రంగం కొన్నిసార్లు ప‌లు స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటోంది. మౌలిక‌స‌దుపాయాల్ని అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అనుమ‌తుల్నీ అతివేగంగా మంజూరు చేయాలి. సుల‌భ‌త‌ర‌మైన వాణిజ్య విధానాన్ని పెంపొందించాలి.
బిల్డ‌ర్ల క‌మ్యూనిటీలో క్రెడాయ్ ఐక్య‌త‌ను తేవ‌డంలో గొప్ప విజ‌యం సాధించింది. రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ డైన‌మిక్స్‌ను డెవ‌ల‌ప‌ర్ల‌కు అర్థ‌మ‌య్యేలా చేసింది. రెరా బిల్డ‌ర్ల‌లో న‌మ్మ‌కాన్ని పెంపొందిస్తోంది.

This website uses cookies.