rajapushpa regalia Kokapet
మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ అయిన కోకాపేట్‌లో రెడీ టు ఆక్యుపై ప్రాజెక్టులో ఫ్లాట్ లభించడం అంటే జాక్ పాట్ కొట్టినట్లే. పైగా, హైదరాబాద్‌లో టాప్ డెవలపర్ డెవలప్ చేసిన ప్రాజెక్టు అంటే వెనుతిరిగి చూడక్కర్లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావడంతో అదనంగా జీఎస్టీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మరెందకు ఆలస్యం.. వెంటనే ఈ ప్రాజెక్టును ఒకసారి చూసేందుకు కోకాపేట్ వెళ్లాల్సిందే.
రాజపుష్ప ప్రాపర్టీస్ కోకాపేట్‌లో 4.23 ఎకరాల్లో 491 ఫ్లాట్ల ప్రాజెక్టు అయిన రాజపుష్ప రెగాలియాకు శ్రీకారం చుట్టింది. మూడు టవర్లను 19 అంతస్తుల ఎత్తులో నిర్మించింది. ఫ్లాట్ల సైజు 1610 నుంచి 2600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ధర విషయానికొస్తే.. రూ.1.1 కోట్ల నుంచి ఆరంభమవుతుంది. ఇందులో నిర్మాణం వచ్చింది కేవలం 25 శాతం స్థలంలోనే. మిగతాదంతా ఖాళీ స్థలంగా వదిలివేశారు. కాస్త ప్రత్యేకంగా నివసించాలని కోరుకునేవారికి ఈ ప్రాజెక్టు చక్కగా నప్పుతుందని రాజపుష్ప ప్రాపర్టీస్ చెబుతోంది.
This website uses cookies.