మ్యాక్ ప్రాజెక్ట్స్ ( MAK Project ) అంటే గుర్తుకొచ్చేది.. బీటీఆర్ గ్రీన్స్. బన్యన్ ట్రీ రిట్రీట్. శ్రీశైలం రోడ్డులో సుమారు 250 ఎకరాల్లో విడతలవారీగా ఈ ప్రాజెక్టును సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఇందులో విల్లాలు కొన్నవారు ఆనందంగా నివసిస్తున్నారు. మరో విల్లా ప్రాజెక్టును ఆరంభించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇది కాకుండా, ప్రత్యేకంగా ప్లాట్లనూ విక్రయిస్తోంది. ఒక్కోటి 417 గజాల నుంచి వెయ్యి గజాల్లోపు ఉంది. తాజాగా, లగ్జరీ అపార్టుమెంట్‌ని కూడా మ్యాక్ ప్రాజెక్ట్స్ ఆరంభించింది.
బీటీఆర్ సెరినిటీ అని నామకరణం చేసిన ఈ లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్టులో ఫ్లాట్లు.. 746 చదరపు అడుగుల నుంచి 3068 చ.అ. సైజు దాకా అందుబాటులో ఉన్నాయి. అధిక శాతం డబుల్, ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లకు సంస్థ పెద్దపీట వేసింది. ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ.4,299గా నిర్ణయించింది. కార్ పార్కింగ్, ఎమినిటీస్ కు రూ.3.5 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కార్పస్ ఫండ్ చదరపు అడుక్కీ రూ.50 కట్టాల్సి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ఫ్లాటు బుక్ చేసుకోవాలంటే.. రూ.2.5 లక్షలు చెల్లించాలి. ఆ తర్వాత పదిహేను రోజుల్లో 20 శాతం కట్టాలి. ఆధునిక సదుపాయాలకు సంస్థ పెద్దపీట వేసింది. కాబట్టి, ప్రశాంతమైన జీవనాన్ని కోరుకునేవారికి తమ ప్రాజెక్టు చక్కగా నప్పుతుందని మ్యాక్ ప్రాజెక్ట్స్ అంటోంది.
This website uses cookies.