Categories: Celebrity Homes

నా ఇల్లు డెన్ కంటే తక్కువేం కాదు

ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. బాహుబలిలో భళ్లాల దేవుడిగా మంచి పేరు తెచ్చుకున్న రానా ఇల్లు ఎలా ఉందో చూద్దామా? నిజానికి ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ ఇతరులతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు. ఆయన చిన్న ప్రదేశంలోనే ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. ఇంటికి సంబంధించి తనలోని క్రియేటివిటీని కొన్నేళ్ల క్రితమే బహిర్గతం చేశారు. ఆ విలాసవంతమైన స్థలాన్ని తన కలల ఇల్లుగా అభివర్ణిస్తారు.


‘నా ఇల్లు డెన్ కంటే తక్కువ కాదు. ఇంటి డెకార్ ను సవాల్ గా తీసుకున్నాను. దానిని ధైర్యవంతమైన ఇంటిగా మార్చాను. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సాలిట్యూడ్ కార్నర్’ నాకు చాలా ఇష్టం. నా సినిమా పుస్తకాలను అక్కడే చదవడానికి ఇష్టపడతాను. అది నాలోని మంచి, చెడులను హైలైట్ చేస్తుంది. నటుడిగా నేను ఎలా ఉండాలనేది నేను అక్కడ నుంచే నేర్చుకుంటాను’ అని రానా తెలిపారు. రానా బంగ్లాలో కొన్ని అద్వితీయమైన ఫీచర్లు ఉన్నాయి. ‘సినిమాలకు సంబంధించిన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకున్నాను. వేసవి సాయంత్రాల్లో ఇది ఓ పార్టీ స్పేస్ గా మారిపోతుంది. నా ఇంట్లో ఇది ఓ ఫంక్షనల్ ఫీచర్. అందులో చాలా టాప్ పిక్స్ చూస్తారు. సినిమాల గురించి అక్కడ చాలా చర్చిస్తాం. మా నాన్న ఫుట్ బాల్ అభిమాని. అందువల్ల ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఫుట్ బాల్ కు సంబంధించిన ఉత్పత్తులను కొని తీసుకొచ్చి బార్ ఎరీనాలో ఉంచాం. ఇక బాటిళ్లను కట్ చేసి అందంగా అలంకరించడం నా హాబీ. నా ఇంటిని వాటితో మరింత ఆకర్షణీయంగా చేయొచ్చని గ్రహించాను. అలాగే అలంకరించాను’ అని వివరించారు.

ఇంట్లోనే ఉన్నప్పటికీ రానా ఆఫీస్ రూమ్ ఆయన్ను ఉత్సాహంగా ఉంచుతుంది. గోడ నిండా అన్నీ సినిమా పోస్టర్లే. ‘అవన్నీ నేను చేసిన రానా దగ్గుబాటి సినిమా పోస్టర్లు. ప్రపంచ సినిమాలో జోకర్ అనేది అద్వితీయమైన పాత్ర. అందువల్ల అది నా ఇంట్లో ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. మీరు వాటిని ఎప్పటికప్పుడు అనుసరించకపోతే వెనకబడిపోతారు. నేను కాలానుగుణంగా మారడాన్ని ఇష్టపడతాను. అందుకే నా సాల్టిట్యూడ్ కార్నర్ ను చెక్కతో చేయించాను. త్వరలోనే కొన్ని ట్రాపికల్ ప్రింట్లు నా ఇంట్లో దర్శనమిస్తాయి. అవి నా ఆఫీస్ రూమ్ కు తగిన సౌందర్యాన్ని తీసుకువస్తాయి’ అని రానా తన ఇంటి గురించి వివరించారు.

This website uses cookies.