కొన్ని కంపెనీలేం చేస్తున్నాయంటే.. ఎకరానికి కోటీ రూపాయల చొప్పున భూమిని కొంటున్నాయి. 18 నెలల్లో దాన్ని రేటు కోటీన్నర అవుతుందని హామీ ఇస్తున్నాయి. అంటే, కనీసం యాభై లక్షల పెరుగుదల ఉంటుందని మభ్యపెడుతున్నాయి. మార్కెట్ మెరుగ్గా లేకపోతే రేటెందుకు పెరుగుతుంది? ఒకవైపు కొనేవాళ్లు తగ్గిపోతుంటే.. పెట్టుబడి నిమిత్తం కొనేదెవరు? సరిగ్గా ఈ అంశాన్ని గుర్తించిన కొందరు రియల్టర్లు.. ప్రీలాంచ్‌లో అమ్మిన భూములకు డీటీసీపీ అనుమతిని తీసుకొచ్చి.. వాటి రేటు పెరిగినట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీలాంచ్‌లో కోటీ పెడితే.. డీటీసీపీ అనుమతి వచ్చాక దాన్ని విలువ కోటీన్నరకు పెరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు మార్కెట్టే లేదంటే.. అమ్మకాలు తగ్గిపోయి.. కొందరు డెవలపర్లు నానా ఇబ్బందులు పడుతుంటే.. కొందరేమో ఇలా తప్పుడు విధానాలతో కొనుగోలుదారులను బోల్తా కొట్టిస్తున్నారు. నగరంలో ఇలా మోసపూరిత విధానాల్ని అవలంబించే రియల్టర్లు ఉన్నంత కాలం… ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదని బయ్యర్లు వాపోతున్నారు.
This website uses cookies.