Categories: Celebrity Homes

రూ.3.1 కోట్లకు ఫ్లాట్‌ అమ్మిన కాజోల్

బాలీవుడ్ నటి కాజోల్ ముంబై పోవైలోని హీరానందని గార్డెన్స్ లో ఉన్న 762 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను రూ.3.1 కోట్లకు విక్రయించారు. వృషాలి రజనీష్ రాణే, రజనీష్ విశ్వనాథ్ రాణే అనే వ్యక్తులు ఆమె అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ఈనెల 20న ఈ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. 762 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ పోవై హీరానందని గార్డెన్స్ లో అట్లాంటిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లోని 21వ అంతస్తులో ఉంది. ఈ అపార్ట్ మెంట్ తోపాటు రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి. రెరా కార్పెట్ ఏరియా ప్రకారం చదరపు అడుగు ధర రూ.40,682గా ఉంది.

కాగా, ఈ నెల ప్రారంభంలో కాజోల్ ముంబై సమీపంలోని గోరేగావ్ వెస్ట్ లో రూ.28.78 కోట్ల విలువైన 4365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేశారు. బంగూర్ నగర్‌లోని లింకింగ్ రోడ్‌లో ఉన్న ఓ భవనంలో ఫ్లోర్‌లోని రిటైల్ స్థలాన్ని ఆమె భారత్ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశారు. అలాగే 2023లో కాజోల్ ముంబైలో రూ.7.64 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొన్నారు. 194.67 చదరపు మీటర్ల రెరా కార్పెట్ ఏరియాలో విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్థలం ముంబై అంధేరి వెస్ట్ లోని వీర దేశాయ్ రోడ్ ఓషివారాలోని సిగ్నేచర్ భవనంలో ఉంది. అదే సంవత్సరం ఆమె భారత్ రియాలిటీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ముంబైలో రూ.16.50 కోట్లకు ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు.

This website uses cookies.