poulomi avante poulomi avante

వెంచ‌ర్లు డ‌ల్‌.. సేల్స్ నిల్‌..

తెలంగాణ‌లో స్థిర‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ.. ప‌లు రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల‌లో ప్లాట్ల అమ్మ‌కాలు పెర‌గ‌ట్లేదు. సుమారు మూడు నెల‌ల్నుంచి మార్కెట్లో సేల్స్ లేక‌పోవ‌డంతో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఫార్మా సిటీ, ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ ర‌ద్దు కావ‌డంతో ప్లాటింగ్ మార్కెట్‌లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో.. అక్క‌డ ప్ర‌భుత్వం గ‌న‌క మారిపోతే.. రియ‌ల్ రంగానికి మ‌ళ్లీ డిమాండ్ పెరుగుతుంద‌ని కొంద‌రు పెట్టుబ‌డిదారులు భావిస్తున్నారు. అందుకే, అనేక‌మంది ఇన్వెస్ట‌ర్లు.. కొంత‌కాలం పాటు వేచి చూసే ధోర‌ణీని అల‌వ‌ర్చుకున్నార‌ని రియ‌ల్ నిపుణులు అంటున్నారు.

తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మారిన‌ట్లే.. ఆంధ్ర‌లోనూ కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ ఏర్ప‌డుతుంద‌ని.. అక్క‌డి ప్లాట్లు, ఫ్లాట్ల ధ‌ర‌లు పెరుగుతాయ‌ని.. అనేక‌మంది ఇన్వెస్ట‌ర్లు భావిస్తున్నారు. ఫ‌లితంగా, హైద‌రాబాద్ వెంచ‌ర్ల‌లో ప్లాట్లు కొనేవారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. అమ్మ‌కాలు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో రియ‌ల్ట‌ర్లలోనూ నీర‌సం ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితి ఇంకెంత కాలం కొన‌సాగుతుందో తెలియ‌క.. కొంద‌రు ప్ర‌మోట‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ప్లాట్ల‌ను కొనడానికి ఎవ‌రూ పెద్ద‌గా ఉత్సాహం చూపెట్ల‌డం లేద‌ని కొంద‌రు రియ‌ల్ వ్యాపారులు రియ‌ల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.

గ‌త మూడేళ్ల‌లో హైద‌రాబాద్ నుంచి ఎంతో దూరంగా కొంద‌రు రియ‌ల్ట‌ర్లు వెంచ‌ర్ల‌ను అభివృద్శి చేయ‌డం ఆరంభించారు. ప‌దేళ్ల క్రితం ద‌క్షిణం వైపు షాద్‌న‌గ‌ర్ దాటిన త‌ర్వాతి ప్రాంతాల‌ వ‌ర‌కే వెంచ‌ర్లు ఉండేవి. ఇప్పుడేమో అవి జ‌డ్చ‌ర్ల‌ను దాటేశాయి. శంక‌ర్‌ప‌ల్లి వ‌ర‌కూ ద‌ర్శ‌న‌మిచ్చే వెంచ‌ర్లు వికారాబాద్ను దాటిపోయాయి. సంగారెడ్డి దూర‌మ‌నుకుంటే.. స‌దాశివపేట్, జ‌హీరాబాద్‌ను దాటుకుని వెంచ‌ర్లు వేసే రియ‌ల్ట‌ర్ల‌ సంఖ్య పెరిగింది. ఈస్ట్ హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే ఆలేరు, జ‌న‌గాం దాకా వెంచ‌ర్లు వెలిశాయి. విజ‌య‌వాడ వైపు నార్క‌ట్‌ప‌ల్లికి చేరుకున్నాయి.
వ‌చ్చే ప‌దేళ్ల‌లో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాల్లో ప్లాట్ల‌ను అమ్ముతున్నారు. అందుకే, చాలామంది అక్క‌డ ప్లాట్లు కొనుక్కోవ‌డం లేదు. ఒక‌వేళ ప్లాట్లు కొనుక్కున్నా.. వెంట‌నే ఇల్లు క‌ట్టుకునే ప‌రిస్థితి లేనే లేదు. ఇల్లు క‌ట్టాల్సిన ప్రాంతంలో గ‌జం రేటు ఇర‌వై వేలు దాటేసింది. అంటే, రెండు వంద‌ల గ‌జాల ప్లాటు కొనుక్కుని ఇల్లు క‌ట్టుకోవాలంటే ఎంత‌లేద‌న్నా రూ.60 ల‌క్ష‌లు అవుతుంది. మ‌రి, అంత దూరం వెళ్లి, నివాస‌యోగ్యం లేని ప్రాంతాల్లో నివ‌సించ‌డం కంటే.. హైద‌రాబాద్ చేరువ‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు కొనుక్కోవ‌డం ఉత్త‌మమ‌ని భావించే బ‌య్య‌ర్లు అధిక‌మయ్యారు. ప్లాట్ల రేట్లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డానికిదో కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles