Categories: Rera

రెరాలో రిజిస్ట్రేషన్లు పెరిగాయ్

దేశవ్యాప్తంగా రియల్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి తీసుకొచ్చిన రెరా క్రమంగా పుంజుకుంటోంది. కొత్తగా చేపట్టే ప్రతి ప్రాజెక్టునూ రెరాలో రిజిస్టర్ చేయడం తప్పనిసరి కావడంతో రెరాలో కొత్త ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా 19,050 ప్రాజెక్టులు రెరాలో నమోదయ్యాయి. ఇందులో జూలైలో అత్యధికంగా 2,281 ప్రాజెక్టులు రిజిస్టర్ కాగా, డిసెంబర్లో 2,134 ప్రాజెక్టులు నమోదయ్యాయి. సగటున నెలకు 1587 ప్రాజెక్టులు రెరాలో నమోదు కావడం గమనార్హం. రెరాలో నమోదైన మొత్తం ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అత్యధికంగా 45 శాతం ఉన్నాయి. కమర్షియల్ ప్రాజెక్టులు 10 శాతం ఉండగా.. వెంచర్లు 12 శాతం, ఇతర ప్రాజెక్టులు 33 శాతం ఉన్నాయి. ఇక గతేడాది మొత్తం 4.82 లక్షల ఇళ్లు అమ్ముడుకాగా, మరో 10.42 లక్షల ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. గతేడాది మొత్తం 71,912 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

This website uses cookies.