RS Pasuraa Developers Clarified that there is no legal case in Kollur Survey no 138/AA
కొల్లూరులోని 138/ఏఏ సర్వే నెంబర్ మీద ఎలాంటి కేసుల్లేవని.. ఆయా సర్వే పరిధిలోకి వచ్చే భూమి.. తమ సంస్థ పేరిట నమోదైందని.. ఆర్ఎస్ పసురా డెవలపర్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కొల్లూరులోని 137, 138 సర్వే నెంబర్లలో కేసు ఉన్నప్పటికీ హెచ్ఎండీఏ అనుమతిని మంజూరు చేసిందంటూ రెజ్ న్యూస్ ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆర్ఎస్ పసురా డెవలపర్స్ సంస్థ స్పందిస్తూ ఈ కేసుకు సంబంధించి స్పష్టతనిచ్చింది. కొల్లూరులోని సర్వే నెంబర్ 138/ఈ1లో నమోదైన కేసు (182 ఆఫ్ 2016) కు సంబంధించి.. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకున్నాయని ఆర్ఎస్ పసురా డెవలపర్స్ తెలియజేసింది. కాబట్టి, తమ ప్రాజెక్టులో ఎవరైనా కొనుగోళ్లు జరపొచ్చని వివరణ ఇచ్చింది. నిర్ణీత గడువులోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళికల్ని రచిస్తున్నామని.. ప్రాజెక్టు డెలివరి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదని ఆర్ఎస్ పసురా డెవలపర్స్ తెలియజేసింది.
This website uses cookies.