తుక్కుగూడ సమీపంలోని లెమూర్ లో సన్నిధి అంకుర ప్రాజెక్టు లో ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. అటు శ్రీశైలం హైవేకి, ఇటు రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గర్లో చక్కని లోకేషన్ లో ఉండటం ఈ ప్రాజెక్టుకు మంచి సానుకూలాంశం. వీడియోకాన్ ప్రాజెక్టుతోపాటు ముచ్చెర్ల ఐటీ పార్క్, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ వంటివి అత్యంత సమీపంలో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెం.14 కేవలం పది నిమిషాల దూరంలో ఉంది.
తుక్కుగూడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సైట్ లో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. 100, 60, 40, 30 అడుగుల రహదారులు, భూగర్భ విద్యుత్ లైన్లు, అవెన్యూ ప్లాంటేషన్, టైల్డ్ ఫుట్ పాత్ లు, మొత్తం లేఔట్ చుట్టూ ప్రహరీ గోడ, వర్షపు నీటి ఇంకుడు గుంతలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వంద శాతం వాస్తుతో టీఎస్ రెరా, హెచ్ఎండీఏ అనుమతులతో వేసిన ఈ లేఔట్ లో 150 నుంచి 267 చదరపు గజాల మధ్యలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. చదరపు గజం కేవలం రూ.16 వేలు మాత్రమే.
This website uses cookies.