జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు.. హైదరాబాద్‌లో ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మడానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నట్లు ఉంది. ముఖ్యంగా, కోకాపేట్ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇప్పటికే ప్రీలాంచ్ సేల్స్ చేసింది. ఆ సంస్థపై రెరా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా, ప్రీలాంచుల కోవలోకి చేరింది.. శోభా డెవలపర్స్. ఈ సంస్థ అంటే బయ్యర్లకు ఎక్కడ్లేని నమ్మకం. నాణ్యత విషయంలో రాజీలేకుండా నిర్మాణాల్ని అందజేస్తుందనే భరోసా బయ్యర్లలో నెలకొని ఉంది. కాకపోతే, రెరా అనుమతి లేకుండా.. హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మడం కరెక్టు కాదని నిపుణులు అంటున్నారు. ఈ సంస్థ ఎంచక్కా రెరా అనుమతితో ఫ్లాట్లను విక్రయిస్తే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే, రెరా నిబంధనల్ని తుంగలో తొక్కేసి.. ముందస్తు అమ్మకాల్ని చేయడం కరెక్టు కాదని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించి టీజీ రెరా అయితే ఎలాంటి చర్యలు తీసుకోదనే విషయం తెలిసిందే. కొనుగోలుదారులే ప్రీలాంచ్‌లో కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.
This website uses cookies.