ఇళ్ల కొనుగోలుదారులకు బిల్డర్లపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అది బిల్డర్లకు పరువున ష్టం కలిగించే అంశం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గృహ కొనుగోలుదారులకు తమ ఫిర్యాదులపై బిల్డర్లపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని, దుర్వినియోగం కాని బ్యానర్లు లేదా శాంతియుత ప్రదర్శనల ద్వారా వినియోగదారుల అసంతృప్తిని వ్యక్తం చేయడం వాక్ స్వాతంత్య్ర హక్కు కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. నిర్మాణ నాణ్యత సరిగా లేదని పేర్కొంటూ డెవలపర్ ప్రాంగణం వెలుపల బ్యానర్ ప్రదర్శించిన కొనుగోలుదారుల బృందంపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ ను కొట్టివేసింది.
“అప్పీలుదారులు చేపట్టిన నిరసన తీరు శాంతియుతంగా, క్రమబద్ధంగా ఉందని.. ఎటువంటి అభ్యంతరకరమైన లేదా దుర్వినియోగ భాషను ఉపయోగించకుండా ఉందని నిర్ధారణకు వచ్చాం. అప్పీలుదారులు లక్ష్మణ రేఖను దాటి నేరపూరిత ప్రాంతంలోకి ప్రవేశించారని చెప్పలేం” అని న్యాయమూర్తులు జసిటస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని ఉల్లంఘించకుండా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు సంబంధిత హక్కు, విక్రేత తన వాణిజ్య ప్రసంగ హక్కును అనుభవిస్తున్నట్లే.. వినియోగదారులు కూడా దానిని కలిగి ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది.
This website uses cookies.